English | Telugu

డేంజర్ జోన్ లో మెరీనా-రోహిత్ !


బిగ్ బాస్ హౌస్ లో గందరగోళం జరుగుతుంది. కారణం కంటెస్టెంట్స్ చేసే పనులకి, స్ట్రాటజీలకు బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులు..ఎవరు నటిస్తున్నారు? ఎవరు ఫేక్ ? అని తెలుసుకోలేకపోతున్నారు.

అయితే నిన్న మొన్నటి దాకా అందరూ కలసి ఇనయాను టార్గెట్ చేసారు అని అనిపించింది. కానీ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తనను సపోర్ట్ చేసేవారు ఎక్కువ అయ్యారు. అయితే కీర్తి భట్, శ్రీహాన్ ల మధ్య ఒక ఇగోతో కూడిన కోల్డ్ వార్ జరుగుతోంది అని చెప్పాలి.

అయితే టాప్ త్రీ లో ఉండాల్సిన ఆదిరెడ్డి , ఓటింగ్ పర్సెంటేజ్ పూర్తిగా పడిపోయింది. ఆదిరెడ్డి టాస్క్ లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే, హౌస్ మేట్స్ తో తన ప్రవర్తన మారిపోవడం మరొక కారణం. కాగా మెరీనా, రోహిత్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. కీర్తి భట్ గేమ్ లో బాగా పర్ఫామెన్స్ ఇవ్వడంతో, ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. దీంతో ఆదిరెడ్డిని దాటి తన టాప్ ఫై లో స్థానం సంపాదించింది. ఇక వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అని ఉత్కంఠ అందరిలోను ఉంది.