English | Telugu
కొత్త కెప్టెన్ గా రేవంత్!
Updated : Nov 18, 2022
బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బయట ఫ్యాన్ బేస్ కూడా చాలానే ఉంది. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా జరిగిన గేమ్ లో రేవంత్ గెలిచాడు.
టాస్క్ లో గెలిచి, కెప్టెన్ గా ఎన్నికైన రేవంత్ కి ఇది సెకండ్ టైం కావడం విశేషం. కాగా సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
రేవంత్ హౌస్ లో అందరిని బాగా హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే ఆ లీడర్ షిప్ క్వాలిటీస్ తనలో ఉన్నాయని మొదటిసారి కెప్టెన్ అయ్యినప్పుడు స్వయంగా నాగార్జునే చెప్పాడు. కాగా హౌస్ లో ఉన్న పది మందిలో అందరు రేవంత్ తో బాగా మాట్లాడేవాళ్ళే, ఒక్క ఇనయా తప్ప. అయితే రేవంత్ మరో వారం కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినందువల్ల ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.