English | Telugu
టాస్క్‌లో టఫ్ ఫైట్ ఇచ్చి ట్రెండింగ్‌లో ఉన్న ఇనయా!
Updated : Nov 18, 2022
బిగ్ బాస్ లో ప్రతీవారం కెప్టెన్ కోసం పోటీ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఆ టాస్క్ లు గెలవాలంటే బుద్ధిబలంతో పాటుగా, కండ బలం కూడా ఉండాలి. అయితే ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్ తో పాటుగా ఇనయా ఉంది.
అయితే టాస్క్ మొదలవ్వక ముందుఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తా అని మాట్లాడాడు రేవంత్. తర్వాత శ్రీహాన్ తో కలిసి ఆడాడు. ఆ తర్వాత ఇనయాని రేవంత్ ఓడించాడు. అయితే రేవంత్ కి గట్టి పోటీని ఇచ్చింది ఇనయా. ఇది చూసి హౌస్ మేట్స్ అందరు 'వెల్ డిఫెండ్ ఇనయా' అంటూ సపోర్ట్ గా ఉన్నారు.
కాగా తను మాత్రం ఏడుస్తూ కనిపించింది. "కెప్టెన్ కోసం జరిగే చివరి టాస్క్ లో ఓడిపోవడం కొత్తేమీ కాదు. నాకు ప్రతీసారి ఇదే జరుగుతుంది" అని ఇనయా ఒక్కతే, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. అయితే ఇనయా ఫైట్ ని వీక్షించిన ప్రేక్షకులు, తమ సపోర్ట్ ని తెలుపుతున్నారు. కాగా ఇప్పుడు #Inayaట్రెండింగ్ లో ఉంది. దీంతో ఎలిమినేషన్ లో ఉన్న ఇనయా గ్రాఫ్ అమాంతం పెరిగి, ప్రస్తుతం సెకండ్ ప్లేస్ కి చేరుకుంది. ఇది ఇలాగే కొనసాగితే తనే బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.