English | Telugu
బిగ్‌బాస్ షోపై మాధవీలత షాకింగ్ కామెంట్స్
Updated : Nov 19, 2021
తెలుగు బిగ్‌బాస్ షోపై గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మొదలైన సీజన్ 5పై కూడా విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌పై మాత్రపై అడల్ట్ కామెంట్స్ వినిపించేవి కానీ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌పై కూడా అదే తరహా ఆరోపణలు.. వినిపించడం పలువురిని షాక్‌కు గురిచేస్తోంది.
తెలుగులో మొదలైన తొలి సీజన్ నుంచి కంటెస్టెంట్‌ల ఎంపిక విషయంలో కాస్టింగ్ కౌచ్ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే తాజా సీజన్‌లో మాత్రం అడల్ట్ కంటెంట్ వుందని.. దానికి సంబంధించిన వీడియోలు తన దగ్గర వున్నాయంటూ నటి, బీజేపీ మహిళా విభాగం నాయకురాలు మాధవీలత తాజాగా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. షో రేటింగ్ తగ్గడంతో నిర్వాహకులు అడల్ట్ సీన్‌లకి తెగించారని అందుకు సంబంధించిన వీడియోలు తన దగ్గర వున్నాయంటూ మాధవీలత సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
మాధవీలత బిగ్‌బాస్ లోని అడల్డ్ సీన్‌లకు `రగులుతోంది మొగలి పొద` అని పేరు పెట్టింది. ఈ వీడియోలు చాలా దారుణంగా వున్నాయని, అయితే వీటిని బయటపెట్టడం సభ్యత కాదన్న చిన్న కారణంతో వాటిని బయటపెట్టడం లేదని చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.