English | Telugu
బిగ్‌బాస్ ఓ సైకో గేమ్
Updated : Nov 17, 2021
బిగ్‌బాస్ సీజన్ 5పై వరుస విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. హోస్ట్ నాగార్జునతో పాటు నిర్వాహకులు షోని రన్ చేస్తున్న తీరు ప్రేక్షకులకి అసహనాన్ని తెప్పిస్తోంది. శనివారం జరిగిన రచ్చతో పాటు ఆ రోజు నాగ్ .. సన్నీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకులని సైతం ఆగ్రహానికి గురిచేసింది. ఇదిలా వుంటే బిగ్‌బాస్‌పై నటి, బిజేపీ మహిళా విభాగం నాయకురాలు మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్‌పై నిప్పులు చెరిగింది మాధవీలత. బిగ్‌బాస్ ఓ సైకో గేమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, గతంలో పల్లెటూళ్లలో అనాగరిక శిక్షలు వుండేవి. తప్పు చేసిన వాడికి సగం మీసం కట్ చేసి లేదా గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేవారు. కొంత మంది ఈ పనులకి అవమాన భారంతో చనిపోయేవారు. ఇదే తరహా సంస్కృతి బిగ్‌బాస్ హౌస్‌లో కనిపిస్తోందని నిప్పులు చెరిగింది మాధవీలత.
సైకో మనస్తత్వం వున్న వారికి టాస్క్‌లని రాసే అవకాశం ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ విష సంస్కృతిని అన్ని భాషల్లోనూ కొనసాగించడం .. బిగ్‌బాస్ వ్యక్తులని ఫేమస్ చేసి వారికి జ్ణానాన్ని అందించే దేవాలం అని డబ్బా కొట్టడం .. తప్పులు జరుగుతున్నా ఆ తప్పులు చేస్తున్న వారినే హోస్ట్ వెనకేసుకు వస్తూ సమాజానికి విష సంస్కృతిని పెంపొందిస్తున్నారని మాధవీలత బిగ్‌బాస్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.