English | Telugu
ఇంటింటి గృహలక్ష్మి : భాగ్య చెంప ఛెల్లుమనిపించిన లాస్య
Updated : Nov 17, 2021
`స్టార్ మా`లో ప్రసారం అవుతున్న హెవీ డోస్ ఫ్యామిలీ డ్రామా `ఇంటింటి గృహలక్ష్మి`. కస్తూరి, నందగోపాల్, లాస్య, లహరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సాగుతున్న ఈ ధారావాహిక ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గత కొన్ని వారాలుగా రసవత్తర ములుపులతో సాగుతున్న ఈ సీరియల్ బుధవారం షాకింగ్ సర్‌ప్రైజ్ లతో ఆకట్టుకోబోతోంది.
గత కొంత కాలంగా తనకు అండగా నిలుస్తూ తులసిని ఇబ్బందులకు గురిచేసే క్రమంలో సహకరిస్తున్న భాగ్యని చెంపని లాస్య ఛెల్లు మనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆఫీస్ పనిమీదు క్యాంప్‌కి వెళ్లిన తులసి, నందులు దగ్గరవడం లాస్యకు ఇబ్బంది కరంగా మారుతుంది. కట్ చేస్తే తులసి కళ్లు తరిగి పడిపోతుంది. వెంటనే నందు డాక్టర్‌కి ఫోన్ చేసి రప్పిస్తాడు. పరీక్షించిన డాక్టర్ ఈమె మీకు ఏమవుతుందని అడుగుతుంది. నందు ఆలోచించి భార్య అంటాడు. ఇంత దానికి ఆలోచించి చెప్పాలా? అని కసురుకున్న డాక్టర్ తులసికి ఇలా జరగడం ఇదే మొదటి సారా అని అడుగుతుంది. దానికి నందు లేదు ఇలా చాలా సార్లు జరిగిందని చెబుతాడు. అయితే తులసికి మరిన్ని పరీక్షలు చేయాలి హాస్పిటల్‌కి తీసుకురండి అంటుంది.
ఇదిలా వుంటే నందు, తులసిల మధ్య దూరం తగ్గుతోందని లాస్య తెగ బాధపడిపోతూ వుంటుంది. ఇదే విషయాన్ని భాగ్యకు చెబుతుంది. దీనికి భాగ్య లాస్యకు దిమ్మదిరిగే ఆన్సర్ ఇస్తుంది. `నువ్వు పెద్దగా భయపడాల్సిన పనిలేదు లాస్య.. బావగారు ఓకే అంటే నువ్వు బావగారు ఒకటవుతారు. పొరపాటున తులసి, బావగారు ఒకటైతే నువ్వు వేరేదారి చూసుకోవాల్సి వస్తుంది` అని అంటుంది భాగ్య. వేరే దారి అంటే అంటుంది లాస్య. వేరు దారి అంటే నువ్వు మరొకరిని పెళ్లిచేసుకుని వెళ్లిపోతావన్నమాట అంటుంది భాగ్య ఆ మాట అనగానే భాగ్య చెంప ఛెల్లుమనిపిస్తుంది లాస్య. .. లాస్య నుంచి ఊహించని స్పందన లభించడంతో భాగ్య బిత్తరపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? భాగ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.