English | Telugu

మేం కలిసున్నప్పుడు టెన్షన్ కన్నా పెన్షన్ ఎక్కువ వచ్చింది

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారంలానే ఈ వారం కూడా అందంగా ముస్తాబైంది. "బంగారం ఒకటి చెప్పనా" అనే కాన్సెప్ట్ తో ఈ వారం రాబోతోంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం అర్జున్, సుహాసిని ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి. ఐతే అర్జున్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య విడిపోయారు. అందుకే వాళ్ళను మళ్ళీ కలిపాక ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పాడు. అర్జున్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యగా కృష్ణభగవాన్, అన్నపూర్ణ నటించారు. వాళ్ళ ఇద్దరినీ కలపడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకొచ్చింది.

ఇక స్టేజి మీదకు "వయ్యారి భామ నీ హంస నడక" అనే పాటతో కృష్ణ భగవాన్ , అన్నపూర్ణ వచ్చారు. "తాతయ్య గారు ఎప్పుడూ ఈ గొడవలేంటి.. అసలు మీరెప్పుడు చూసారు అమ్మమ్మని" అని అడిగాడు ఆది. "ఒకసారి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక కుక్కకు భోజనం పెడుతోంది..కుక్కకే ఇలా పెడుతోంది అంటే నాకు ఇంకెంత బాగా పెడుతుందో" అని అనుకుని పెళ్లి చేసుకున్నా అని చెప్పారు కృష్ణభగవాన్.."మీరు ఇద్దరూ కలిసున్నపుడు టెన్షన్ వచ్చేదా" అని ఆది అడిగేసరికి "టెన్షన్ ఏమో కానీ ఇద్దరికీ కలిపి పెన్షన్ బాగా వచ్చేది" అని కౌంటర్ వేసాడు కృష్ణ భగవాన్. ఇక చివరిలో అర్జున్ అంబటి, సుహాసిని ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు.