English | Telugu
కీర్తి భట్ కి కత్తిపోట్లు.. కొత్త కెప్టెన్ గా శ్రీహాన్!
Updated : Oct 29, 2022
బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కొత్తగా మారుతోంది. రోజు రోజుకి కొత్త టాస్క్ లతో కనువిందు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో కెప్టెన్ కోసం జరిగే టాస్క్ లు కాస్త ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి. కాగా ఈ వారం హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం ముగ్గురు పోటీపడ్డారు.
"శ్రీహాన్ యూ ఆర్ మై ఫేవరేట్ కంటెస్టెంట్, నిన్ను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాను. సూర్య నువ్వు టాస్క్ లో వెనుకబడ్డావ్. అలా ఉండకూడదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్. గేమ్ లో నువ్వు బ్యాక్ అయ్యావ్" అని సూర్య గురించి చెప్పుకొచ్చింది వసంతి. ఆ తర్వాత "కొంచెం కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటోంది అని అనుకున్నా" అని వసంతి చెప్పి కీర్తి భట్ కి కత్తి గుచ్చింది. ఆ తర్వాత కీర్తి భట్ మాట్లాడుతూ, " కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఒకే, కానీ నాకు గుచ్చడం కరెక్ట్ కాదు. నాలో రిజెక్ట్ చేయడానికి ఏమీ లేవు అని కత్తితో పొడవడం ఏంటి" అని సమాధానమిచ్చింది. ఎట్టకేలకు రెండు రోజుల నుండి కొనసాగుతోన్న ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఇక హౌస్ మేట్స్ అందరూ కత్తి గుచ్చే పనిలో ఉన్నారు. అయితే హౌస్ మేట్స్ లో ఎక్కువగా కీర్తి భట్ కి కత్తిపోట్లు పొడిచారు. అంటే తను కెప్టెన్ కి సరిపోదు అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే వీరి ముగ్గురిలో శ్రీహాన్ ఎక్కువ మెజారిటీతో ఉండడంతో శ్రీహాన్ గెలిచాడు.
కాగా సంచాలకులురాలిగా ఉన్న ఫైమా ముగ్గురిలో శ్రీహాన్ గెలిచాడు. కాబట్టి ఈ వారం కెప్టెన్ శ్రీహాన్ అని చెప్పింది. బిగ్ బాస్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించమని శ్రీహాన్ కి తెలియజేసాడు. అయితే శ్రీహాన్ సింహసనం మీద కూర్చున్నప్పుడు హౌస్ మేట్స్ అంతా 'ఓ' అంటు అరుస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొత్తగా ఎన్నికైన శ్రీహాన్ హౌస్ మేట్స్ ని ఎలా మేనేజ్ చేస్తాడో చూడాల్సి ఉంది.