English | Telugu

కెప్టెన్సీ కోసం నా క్యారెక్టర్ మార్చుకోను!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్స్ స్టేజ్ కి వెళ్ళగా, హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు వచ్చింది. చివరగా కెప్టెన్ పోటీదారులుగా శ్రీహాన్, కీర్తి భట్, సూర్య.. ముగ్గురు బరిలో ఉన్నారు."ఈ వారం కెప్టెన్ గా ఎవరిని ఎన్నుకుంటారో హౌస్ మేట్స్ నిర్ణయించుకోవలసి ఉంటుంది. కెప్టెన్ గా ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారో వారి మెడలో ఉన్న థర్మకోల్ తో చేసిన 'సి' లెటర్ మీద కత్తితో పొడవాలి. అలా ఒక్కొక్కరు తమ ఓట్ ఎవరికో చెప్పాలి" అని బిగ్ బాస్ చెప్పాడు.

కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు అందరి కంటే ఎక్కువ కత్తి పోట్లు సూర్యకి పడగా, కీర్తి భట్ కి, శ్రీహాన్ కి చెరొక కత్తిపోటు దిగింది. అయితే హౌస్ మేట్స్ లో చాలా వరకు సూర్య ఇది వరకు కెప్టెన్ అయ్యాడు కదా అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్, "సూర్య కెప్టెన్సీలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లు చాలా సార్లు వచ్చాయి. కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు" అని తన అభిప్రాయం చెప్పాడు. కీర్తి, సూర్య ఇదివరకు కెప్టెన్ గా ఉన్నారు. శ్రీహాన్ మాత్రం ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు. కాబట్టి అందరి దృష్టి అతని వైపే మొగ్గు చూపుతోంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సూర్యకి, రాజ్ కి మధ్య జరిగిన డిస్కషన్ హాట్ టాపిక్ గా మారింది.

రాజ్, "నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు హౌస్ మేట్స్ తో ఇంకా పనులు చేయించి ఉంటే బాగుండేది. అందరికి కమాండింగ్ గా చెప్పి పనులు చేపించుకుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది" అని సూర్యతో అన్నాడు. దానికి సూర్య, "నేను బెదిరించి పనులు చేయించను. నాకు నచ్చిన విధంగా మాట్లాడి చేపించుకుంటా. కెప్టెన్సీ కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నా నేచర్ మార్చుకోను. కెప్టెన్సీ కంటే కూడా క్యారెక్టర్, నేచరే ముఖ్యం" అని జవాబిచ్చాడు.

కాగా హౌస్ మేట్స్ లో అందరు సూర్య ఇలా మట్లాడటాన్ని నెగెటివ్ గా తీసుకుంటారో? లేక పాజిటివ్ గా తీసుకొని అతడిని కెప్టెన్ గా ఎన్నుకుంటారో చూడాలి. కాగా శ్రీహాన్, సూర్య, కీర్థి.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.