English | Telugu
Karthika Deepam2: కేసు గెలిచిన దీప.. తల్లీకూతుళ్ళ ఎమోషనల్ సీన్!
Updated : Aug 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-122 లో.....లాయర్ జ్యోతి విచారణ కోసం సుమిత్రని బోనులోకి పిలుస్తుంది. దీప మీకు ఎలా తెలుసని జ్యోతి అడగ్గా.. దీప మా అవుట్ హౌస్ లోనే ఉంటుంది. చాలా మంచిది నాకు పెద్ద కూతురు లాగా ఆత్మాభిమనం కలిగిన అమ్మాయి అని, తన భర్త తనని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర చెప్తుంది. కార్తీక్ చేస్తుంది మీ దృష్టిలో మంచి పని అంటారా అని జ్యోతి అడగ్గానే.. నాకు మంచి పని అనిపిస్తుంది.. సాయం చేస్తున్నాడు.. తల్లి బిడ్డ వేరు కాకుండా చూస్తున్నాడని సుమిత్ర అంటుంది. చూసారా కాబోయే అత్త గారే కార్తీక్ తప్పు లేదని చెప్తున్నారని దీపకి సపోర్ట్ గా జ్యోతి మాట్లాడుతుంది.
ఆ తర్వాత అనసూయని బోనులోకి పిలిచి లాయర్ VV విచారిస్తాడు. మీ కోడలు ఆ కార్తీక్ తో తిరగడం మీరు చూసారా అని లాయర్ అడుగుతాడు. చాలాసార్లు చూసానని అనగానే అందరు షాక్ అవుతారు. అందరూ ఇక దీప కేసు ఓడిపోయింది అని అనుకుంటారు. అయితే కార్తీక్ , దీపలకి నిజంగానే సంబంధం ఉందని అంటున్నారా అని లాయర్ అనగానే.. ఎవడన్నాడు కలిసి తిరిగితే సంబంధం ఉన్నట్లేనా.. అది నా పెంపకంలో పెరిగిన పిల్ల.. తప్పు చెయ్యదని అనసూయ అంటుంది. అయితే నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడా అని అడుగగా.. చేసుకున్నాడు, ఊరు అంతా అప్పులు చేస్తే వాడిని వెతుక్కుంటూ దీప వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక.. వాడు దీన్ని మోసం చేసి, రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అప్పుడే సుమిత్ర అమ్మ కార్తీక్ బాబులు సాయం చేసారు. ఇక ఆ శోభకి పిల్లలు పుట్టరని తెలిసి శౌర్యని తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి తల్లి బిడ్డని దూరం చేయకండి అని అనసూయ చెప్పగానే.. నరసింహా తరుపున లాయర్ షాక్ అవుతాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
కాసేపటికి దీపకి అనుకూలంగా తీర్పు వస్తుంది. విడాకూలు కూడా వస్తాయి. నరసింహాకి ఆరు నెలల జైలు శిక్ష జరిమానా విధిస్తారు. శౌర్య గురించి కూడా చెప్పండి అని జడ్జ్ ని జ్యోతి అడుగుతుంది. కాసేపటికి శౌర్యని పిలిపిస్తారు. అమ్మ దగ్గర ఉంటావా.. నాన్న దగ్గర ఉంటావా అని అడుగుతారు. నేను ఆ బూచోడి దగ్గరికి వెళ్ళను.. అమ్మ అయిన నాన్న అయిన నాకు అమ్మే అని శౌర్య అనగానే.. దీప వచ్చి శౌర్యని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో దీప, కార్తీక్, శౌర్యలు బయటకు వస్తారు. వాళ్ళను పారిజాతం, జ్యోత్స్న చూస్తారు. ఆ తర్వాత కార్తీక్ కి దీప తన బాధని చెప్పుకుంటుంది. మరొక వైపు జ్యోత్స్న కన్నతండ్రి పారిజాతం సొంత కొడుకు దాస్ ఎంట్రీ ఇస్తాడు. దీప సుమిత్ర కూతురు అన్న విషయం తెలిసిన ఏకైక వ్యక్తి దాస్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.