English | Telugu
సిరిపై మరోసారి షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్
Updated : Feb 15, 2022
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్మంత్ మరోసారి సిరి హన్మంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. బిగ్‌బాస్ సీజన్ 5లో వీరిద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వరుస హగ్గులతో హౌస్ ని హీటెక్కించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ తరువాత వారు చేసిన అదే పని కారణంగా షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. ఇదిలా వుంటే తాజాగా సిరిపై మరోసారి షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీప్తితో తను విడిపోవడానికి కారణం సిరి కాదన్నాడు.
Also Read:బాలయ్య 'అన్ స్టాపబుల్'.. 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలన రికార్డ్!
సిరి ఎప్పటికీ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతే కాకుండా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షోకు నేను సెట్ కాను. నేను చాలా మూడీగా వుండే వ్యక్తిని. ఎదుటివారితో తక్కువగా కలుస్తుంటాను. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసమే రియాలిటీ షోలో పాల్గొన్నాను. షోలో వున్నప్పుడు ప్రేక్షకులు నా గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారనుకున్నా. కానీ అసలు విషయం బయటికి వచ్చాకే తెలిసింది.
Also Read:మనసులో కోరిక బయటపెట్టిన రోజా.. పంచ్ వేసిన హైపర్ ఆది
నాపై ఎంతటి నెగిటివిటీ ఏర్పడిందో తెలిసింది. ప్రస్తుతం నా వయసు 27 సంవత్సరాలు. కెరీర్, పర్సనల్ లైఫ్ లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అందుకు నాకెలాంటి బాధలేదు. ఎదురుదెబ్బల వల్ల జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకుంటున్నా. హౌస్ లో వున్నప్పుడు సిరితో అతి చనువుగా వుండటమే నెటిజన్ లకు కోపాన్ని తెప్పించిందని అనుకుంటున్నా. దీప్తి నేను విడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. నా వల్ల తను చాలా ట్రోలింగ్ కి గురైంది. సిరితో హౌస్ లో చనువుగా వున్నప్పుడు ట్రోలింగ్ ఎక్కువైనా దీప్తి నన్నే సపోర్ట్ చేసింది. అయితే అది ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. దాంతో తను చాలా వేదనకు గురైంది. చివరికి విడిపోవడమే కరెక్ట్ అనుకుని బ్రేకప్ అయ్యాం. ఇద్దరం మళ్లీ కలుస్తామా లేదా అన్నది ఆ దేవుడి చేతుల్లోనే వుంది` అన్నాడు షణ్ముఖ్ జస్వంత్.