English | Telugu
యష్ - వేదల పెళ్లికి లైన్ క్లియర్
Updated : Feb 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీనియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. పాప ఖుషీ కోసం పెళ్లికి సిద్ధమవుతారు వేద, యష్. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. దాంతో ఎంగేజ్‌మెంట్ కు ఏర్పాట్లు చేస్తారు. వేద స్టేజ్ పైకి విచ్చేసినా యష్ మాత్రం ఎంతకూ రాకపోవడంతో వేద కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలవుతుంది. వేద తల్లి సులోచన.. యష్ ఫ్యామిలీని, అతని తల్లిదండ్రుల్ని నిలదీస్తుంది.
కట్ చేస్తే .. యష్ ఎంగేజ్‌మెంట్ జరుగుతున్న కల్యాణ మండపంలో ప్రత్యక్షమవుతాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్లిన వేద చేయి పట్టుకుని పక్కకు తీసుకెళుతుంది. మీరు అసలు మనిషేనా అంటూ నిలదీస్తుంది. నేను చెప్పేది కాస్త వినమని యష్ అంటున్నా వేద పట్టించుకోదు. దాంతో యష్ కల్పించుకుని తనని క్షమించమని జరిగింది అంతా చెబుతాడు. దీంతో వేద శాంతిస్తుంది. ఆ తరువాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుని తిరిగి కల్యాణ మండపానికి చేరుకుంటారు.
Also Read:యశోధర్ - వేదల ఎంగేజ్‌మెంట్ ఆగుతుందా?
కట్ చేస్తే.. మాళవిక కోసం అభిమన్యు ఎదురుచూస్తుంటాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన మాళవిక ... వేద పెళ్లి చేసుకోబోయే వ్యక్తి యష్ కాదని చెబుతుంది. వేద తన బావతో కలిసి సరదాగా గడుపుతున్న ఓ వీడియోని చూపించి తనే వేదకు కాబోయే భర్త అని చెబుతుంది. అయినా అభిమన్యు నమ్మడు.. వేదని కలిసి తెలుసుకోవాల్సిందని మాళవికని అంటాడు. కట్ చేస్తే యష్ - వేదల ఎంగేజ్‌మెంట్ జరిగిపోతుంది. వేదకు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు యష్.. తరువాత ఒక మాట చెబుతానని యష్ అనడంతో నో టచింగ్స్ అంటూ వేద కండీషన్ పెడుతుంది.. ఆ తరువాత ఏం జరిగింది? .. అభిమన్యుకి అసలు నిజం తెలిసిపోయిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.