English | Telugu

పాలగ్లాస్ తో బెడ్ రూమ్ లోకి వెళ్ళిన కావ్య.. బిత్తెరపోయిన రాజ్!

పాలగ్లాస్ తో బెడ్ రూమ్ లోకి వెళ్ళిన కావ్య.. బిత్తెరపోయిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -196 లో.. సీతారామయ్య దగ్గరికి రాజ్ వచ్చి.. మీకు నీరసంగా ఉన్నట్లు ఉంది హాస్పిటల్ కి వెళదామని అంటాడు. నాకేం పర్లేదు, బాగున్నాను. ఒక విషయం అడుగుతా చెప్పు నువ్వు కావ్యతో మనస్పూర్తిగా హ్యాపీగా ఉన్నావా లేక నా గురించి ఇలా నటిస్తున్నావా అని అడుగుతాడు. ఒక వేల నటన అయితే ఆ తర్వాత కావ్య అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండదని సీతారామయ్య అంటాడు. అదేం లేదు తాతయ్య ఇప్పుడు ఇప్పుడే కావ్యని హ్యాపీగా ఉంచడనికి ట్రై చేస్తున్నానని రాజ్ అంటాడు..

ఆ తర్వాత ఏంటి ఇంత చేస్తున్న తాతయ్యకి డౌట్ వచ్చిందని రాజ్ అనుకుంటాడు. మరొక వైపు స్వప్నకి కనకం ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవకపోవడంతో స్వప్న పై ఇంకా కోపం పెరిగిపోతుంది. మరొక వైపు దుగ్గిరాల అందరు కలిసి భోజనం చేస్తుంటారు. సీతరామయ్య ఆవకాయ వేసుకొని భోజనం చేస్తుంటే రాజ్ వద్దని చెప్తాడు. ఎందుకు వద్దంటున్నవని ఇందిరాదేవి అడుగుతుంది. అంటే మొన్న కళ్ళు తిరిగి పడిపోయాడు కదా మంచి డైట్ ఫాలో అవమన్నారని రాజ్ చెప్తాడు. ఇప్పటినుండి మీ డైట్ గురించి కావ్య చూసుకుంటుందని రాజ్ చెప్తాడు. తాతయ్యకి మళ్ళీ డౌట్ రాకూడదని కావ్యని కూడా భోజనానికి కూర్చొమని రాజ్ అంటాడు. కావ్య ఇబ్బంది పడుతు రాజ్ మాట కాదనలేక భోజనానికి కూర్చుంటుంది. నేను వడ్డీస్తానని కావ్యకి రాజ్ భోజనం వడ్డీస్తాడు. ఆలా రాజ్ కావ్యతో ప్రేమగా ఉండడం చూసిన ఇంట్లో వాళ్ళంతా, వాళ్ళిద్దరిని అలా చూసి సంబరపడుతారు. కానీ రుద్రాణి, అపర్ణ ఇద్దరు మాత్రం కోపంగా ఉంటారు. ఆ తర్వాత కావ్య వెళ్తుండగా కావ్య చీర కొంగు రాజ్ వాచ్ కీ చిక్కుకుంటుంది. కావ్యని రాజ్ అలా వెళ్ళకుండా కావాలనే ఆపుతున్నాడని అనుకొని ధాన్యలక్ష్మి.. ఇలాంటివి ఏమైనా ఉంటే మీ బెడ్ రూమ్ లో చూసుకోండని రాజ్ కీ చెప్తుంది. మీకు అలా అర్థం అయిందా అని రాజ్ అనుకుంటాడు.

ఆ తర్వాత రాజ్ గదిలోకి వెళ్లి అందరి ముందు నా పరువు పోయింది. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో? దీనంతటికీ కారణం ఈ వాచ్ అని దాన్ని తీసి పక్కన పెడతాడు.. ఆ తర్వాత కావ్య గదిలోకి వస్తంటే ఇందిరాదేవి ఆపి కావ్య జడలో పూలు పెడుతుంది. మరొక వైపు దాన్యలక్ష్మి వచ్చి పాల గ్లాస్ ఇస్తుంది. పాలగ్లాస్ తో లోపలికి వెళ్లిన కావ్యని చుసిన రాజ్.. ఏంటి ఇలా వచ్చావని కంగారుపడుతాడు. కావ్య కావాలనే రాజ్ ని అటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.