English | Telugu

వసుధారకి తప్ప వేరేవాళ్ళకి తన మనసులో స్థానం లేదని చెప్పిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -863 లో... వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని అంటుంది. ఏంటని వసుధార అడగ్గానే.. రిషి మనతో పెళ్లి వద్దని చెప్పాడు కదా ఇప్పుడు విశ్వంతో నాతో పెళ్లికి ఒప్పుకున్నాడని ఏంజిల్ సంతోషంగా చెప్తుంటే అది విని వసుధార షాకై కళ్ళు తిరిగిపడిపోతుంది.

ఆ తర్వాత అప్పుడే అక్కడికి వచ్చిన రిషి.. ఏమైందంటూ వసుధారని చేర్ లో కూర్చొపెట్టి మొహంపై వాటర్ చల్లి లేపుతాడు. వసుధార కళ్ళు తెరిచి చూసి మీరు ఏంజిల్ తో పెళ్లికి ఒప్పుకున్నారా అని అడుగుతుంది. లేదని రిషి చెప్పగానే.. మరి ఏంజిల్ అలా అంటుందని వసుధార చెప్తుంది. నా మాట మీద నమ్మకం లేదా? నా మనసులో ఒకరికే స్థానం.‌ అది ఎప్పుడో ఒకరి సొంతం అయిందని రిషి చెప్తాడు. నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావ్. దీనంతటికి కారణం నువ్వేనని చెప్పి రిషి వెళ్ళిపోతాడు. మరొక వైపు ఫోన్ మాట్లాడుతుండగా.. సడన్ గా కట్ అయింది. మళ్ళీ లిఫ్ట్ చెయ్యలేదని వసుధార గురించి ఏంజిల్ టెన్షన్ పడుతుంది. వసుధార దగ్గరికి బయలుదేర్తుంటే వసుధార ఇక్కడికే వస్తుంది కావచ్చు. అందుకే ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదేమోనని విశ్వనాథ్ అనగానే.. అవును అది కరెక్టే అని ఏంజిల్ ఆగిపోతుంది. మరొకవైపు జగతి, మహేంద్ర ఇద్దరు.. శైలేంద్ర మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడో? అసలు శైలేంద్ర దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉంటే బాగుండేదని అనుకుంటారు. అప్పుడే విశ్వనాథ్ ఫోన్ చేసి ఏంజిల్ కి పెళ్లి చేస్తున్నామని జగతి, మహేంద్రలకి‌ చెప్తాడు. అబ్బాయి ఎవరో కాదు రిషి అని విశ్వనాథ్ చెప్పగానే జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. రిషి తరుపున మీరు రావాలని విశ్వనాథ్ చెప్తాడు. ఆ తర్వాత వసుధారకి విషయం తెలుసో లేదో అని ఫోన్ చేస్తే వసుధార లిఫ్ట్ చెయ్యదు. ఎలాగైన అక్కడ ప్రాబ్లమ్ క్లియర్ చేసి, ఇక్కడికి వచ్చి ఫణింద్రతో అంత చెప్పాలని జగతి, మహేంద్ర ఇద్దరు అనుకుంటారు. వాళ్ళ మాటలన్ని శైలేంద్ర విని.. మీరు వెళ్ళండి నాకు ఇక్కడ అన్ని క్లియర్ చేసుకుంటా అని శైలేంద్ర అనుకుంటాడు.

మరొక వైపు వసుధార వాళ్ళ ఇంటి ముందే రిషి బాధపడుతుంటాడు. లోపల వసుధార ఏడుస్తుంటుంది. వసుధార దగ్గరకి చక్రపాణి వెళ్లి రిషి సర్ ని లోపలికి పిలవమని చెప్పగానే.. రిషి సర్ అంటూ వసుధార బయటకు వెళ్తుంది. అది‌ చూసి రిషి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి ఒక దగ్గర కూర్చొని ఉండగా.. వసుధార వెళ్లి రిషితో మాట్లాడుతుంది. అప్పుడే విశ్వనాథ్ ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావ్ ? నీ కోసం ఏంజిల్ స్వీట్ చేసిందని చెప్తాడు. నాకు వర్క్ ఉందని, అయిపోయాక వస్తానని రిషి చెప్తాడు. అప్పుడు రిషి పక్కనే వసుధార‌ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.