English | Telugu

వాంతి చేసుకున్న స్వప్న.. కావ్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -186 లో.. తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం అందరికి తెలిసిపోయేలా ఉందని స్వప్న అనుకొని.. ఎలాగైనా పొట్ట పెంచుకోవాలనుకుంటుంది. స్వప్న బిర్యానీ ఆర్డర్ తెప్పించుకొని తింటుంది. అలా ఒకేసారి ప్లేట్ మొత్తం తినడం చూసిన ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోయి తన దగ్గరకి వచ్చి.. ఎందుకు ఇలా తింటున్నావని అడుగుతుంది. ఏదో ఒక సమాధానం చెప్పి ధాన్యలక్ష్మిని అక్కడ నుండి పంపిస్తుంది.

మరొక వైపు కావ్య మనకు సాయం చేస్తూ అతింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతారు. కావ్య సిచువేషన్ అత్తింట్లో ఎలా ఉందో తెలుసుకోవాలని కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది కనకం. వదినకి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పగానే కనకం కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు రాజ్ స్నానం చేస్తుండగా.. తను వేసిన రీడిజైన్స్ ఎక్కడ ఉన్నాయని కావ్య గదిలో వెతుకుతుంది. వాటిని చూస్తూ ఉండగా రాజ్ వచ్చి డిజైన్స్ లాక్కుంటాడు. మీరు వేసిన డిజైన్స్ చూపించండని కావ్య అడుగుతుంది.‌ నేను చూపించనని రాజ్ చెప్తాడు. మరొక వైపు బిర్యాని ఫుల్ గా తిన్న స్వప్న వాంతి చేసుకుంటుంది. అది చూసి ఇందిరాదేవి వచ్చి రుద్రాణి, రాహుల్ లకు స్వప్నని హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తుంది. ధానికీ రాహుల్ రుద్రాణి సరే అంటారు. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ఎవరికీ తెలియకుండా అబార్షన్ చెప్పిద్దామని రాహుల్ అనగానే.. ఖచ్చితంగా అందరూ మన మీద డౌట్ పడుతారు. ప్లాన్ ఇప్పుడు వర్క్ అవుట్ కాదని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ బట్టలన్ని తీసి కావ్య ఐరన్ చేస్తుంటుంది. అలా చేయడం చూసి నా బట్టలు ఐరన్ ఎందుకు చేస్తున్నావని‌ రాజ్ అడుగుతాడు. మాటల్లో పడి తన తల్లి కావ్యతో ఎవరు మాట్లాడవద్దు అనే షరతుని మర్చిపోయి మాట్లాడతాడు. రాజ్ కి కావ్య మాటకి మాట సమాధానం చెప్పడంతో.. నేను నీ భర్తని నేను చెప్పినట్టు వినాలని రాజ్ అనగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత కావ్య ఇంట్లో అందరూ నాతో మాట్లాడేలా చెయ్యాలని అనుకోని కిచెన్ లో వంట చేస్తున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. నాకు హెల్ప్ చెయ్యండి. మీకు వేలు కట్ అయినట్లు, కట్టు కట్టుకొని రండి. నేను వంట చేస్తానని కావ్య చెప్తుంది. అలా కాసేపటికి వంట చేస్తున్న కావ్యని అపర్ణ చూసి ధాన్యలక్ష్మిని పిలుస్తుంది. వంట తను ఎందుకు చేస్తుందని అడగ్గానే.. వేలు కట్ అయిందని ధాన్యలక్ష్మి చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.