English | Telugu
కావ్య, రాజ్ ల మధ్య రొమాంటిక్ సీన్.. అప్పు ఎమోషనల్!
Updated : Oct 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -233 లో.. కళ్యాణ్, అనామిక, అప్పు లు షాపింగ్ చేసి తిరిగి వస్తుంటారు. అప్పును చూస్తే ఎవరినో లవ్ చేసింది కావచ్చని అనామిక అడుగుతుంది. అప్పు మాత్రం బాధగా చూస్తుంటుంది. అలాంటిదేం లేదని అప్పు అనగానే.. నేను చెప్పాను కదా అప్పుకి అలాంటివేం ఉండవని కళ్యాణ్ అంటాడు. అలా అనగానే అప్పుకి ఇంక బాధగా అనిపిస్తుంది.
మరొకవైపు రాహుల్ తన నగలు తీసుకొని వెళ్లినందుకు రాహుల్ ని స్వప్న తిడుతుంటుంది. వద్దని చెప్పినా నా నగలు దొంగతనంగా తీసుకొని వెళ్ళావని అనగానే స్వప్న పై కోప్పడతాడు రాహుల్. ఆ తర్వాత తన నగలు తీసుకొని వెళ్లి బీరువాలో పెట్టి లాక్ వేసుకుని స్వప్న వెళ్ళిపోతుంది. ఉన్న ఒక్క దారి కూడా లేకుండా పోయిందని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత అప్పు వెళ్తుంటే కళ్యాణ్ అనామికకి దగ్గరగా వచ్చి బై చెప్తుంటే.. అప్పు వాళ్ళని చూసి బాధపడుతుంది. రేపు ఫోటో షూటింగ్ ఉంది నువ్వు కంపల్సరీ రావాలని అప్పుతో అనామిక చెప్తుంది. మరొక వైపు కావ్య ఇంట్లో వర్క్ అంతా చేసి గదిలోకి వచ్చి నడుము నొప్పితో ఇబ్బంది పడుతుంది.
కావ్య అలా ఇబ్బంది పడుతుండగా రాజ్ తననే చూస్తుంటాడు. అలా చూస్తూ ఉండకపోతే వచ్చి ఈ ఆయింట్ మెంట్ రాయొచ్చు కదా అని కావ్య అనగానే.. రాజ్ వచ్చి ఆయింట్ మెంట్ రాస్తాడు. రాజ్ అలా ఆయింట్ మెంట్ రాస్తూ నిన్ను ఒకటి అడగాలా అని అనగానే.. ఏంటి ముద్దు అడుగుతాడా అని కావ్య అనుకుంటుంది. మొన్న నిజంగా గుడికే వెళ్ళావా అని కావ్యని అడగ్గానే.. తను కోపంగా ఆయింట్ మెంట్ రాయడం వద్దని రాజ్ కి చెప్తుంది. మరొకవైపు కనకం తన గదిలో ఉండడం ఇష్టం లేని రుద్రాణి.. కనకం చీరలు అన్ని కట్ చేస్తుంది. ఆ తర్వాత స్నానం చెయ్యడానికి రుద్రాణి గదిలోకి వచ్చిన కనకం బీరువా చూసి.. ఏంటి చీరలు ఇలా అయ్యాయని అడుగుతుంది. ఈ రూమ్ లో ఎలుక ఉందని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.