English | Telugu
రెట్టింపు ఉత్సాహంతో శివాజీ.. జోష్ లో హౌస్ మేట్స్!
Updated : Oct 22, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఏడవ వారం హౌస్ కెప్టెన్ గా అంబటి అర్జున్ ఎంపికయ్యాడు. నామినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో పూజామూర్తి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ డేంజర్ జోన్ లో ఉన్నారు.
శనివారం నాటి ఎపిసోడ్ లో.. శివాజీ చేతి గాయం కారణంగా ఫిజికల్ గేమ్స్ ఆడటం లేదని నాగార్జునని అంబటి అర్జున్ అడిగాడు. దాంతో శివాజీని నాగార్జున సీక్రెట్ రూమ్ కి పిలిచి అడిగాడు. చెప్పండి శివాజీ మీ చేతి నొప్పి ఎలా ఉందని అడుగగా.. బాలేదండి బాబు గారు.. నొప్పి ఎక్కువగా ఉంది. కాస్త ఫిజియోథెరపీ ఉంటే బాగుంటుందని శివాజీ అంటాడు. సరే అయితే ఫిజియో పంపిస్తే ఆడతావ్ కదా అని నాగార్జున అనగా.. ఆడతాను సర్ అని శివాజీ అంటాడు. ఇక హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళమని నాగార్జున చెప్తాడు. ఇక నుండి శివాజీ మెంటల్ గా ఫిజికల్ గా ఆడతాడని అందరికి నాగార్జున చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా చప్పట్లతో, విజిల్స్ తో ఫుల్ జోష్ నింపారు.
ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా తెలిసిందేంటంటే శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తే.. సీరియల్ గ్యాంగ్ చేసే ఆగడాలకి అడ్డు అదుపు ఉండదని బిగ్ బాస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. హౌస్ లో నీకు లాడర్ ఎవరు? స్నేక్ ఎవరని శివాజీని నాగార్జున అడుగగా.. ప్రిన్స్ యావర్ లాడర్, అమర్ దీప్ స్నేక్ అని శివాజీ అన్నాడు. కారణమేంటంటే నేను గేమ్ ఆడకపోయిన, డిస్టబ్ గా ఉన్నా నా దగ్గరుండి.. మీరు ఉండాలి, మీరు మాతో ఉంటే చాలు అనే మాటలు చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపుతుంటాడని అందుకే యావర్ నాకు లాడర్ అని శివాజీ అన్నాడు. ఇక అమర్ దీప్ స్నేక్ అని అన్నాడు. వాడికి మొదటి నుండి నా మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉందని, వాడిలో ట్యాలెంట్ ఉంది. కానీ కొందరి మాటలు విని అలా చేస్తున్నాడని, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడని శివాజీ అన్నాడు.