English | Telugu
అంబటి అర్జున్ నిజస్వరూపం బయటపడిందిగా.. ఆట సందీప్ కి నాగార్జున వార్నింగ్!
Updated : Oct 22, 2023
బిగ్ బాస్ సీజన్-7 శనివారం నాటి ఎపిసోడ్ కోసం ఎంత మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారో తెలిసిందే. దానికి కారణం వారమంతా హౌస్ మేట్స్ చేసే తప్పొప్పులని ఎత్తి చూపుతూ ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్ తీసుకుంటాడు. దాంతో ప్రేక్షకులు వినోదాన్ని పొందుతారు.
శని, ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్ లు ప్రేక్షకులు బాగా ఇష్టపడే ఎపిసోడ్స్. ఫన్ అండ్ ఆటలతో బిగ్ బాస్ ని మరింత ఇంట్రెస్ట్ గా తీర్చిదిద్దుతారు మేకర్స్. నాగార్జున వచ్చి రాగానే శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూపించాడు. కెప్టెన్సీ టాస్క్ లో చివరగా ఆట సందీప్, అంబటి అర్జున్ ఉండగా కొన్ని నిమిషాల తేడాతో అంబటి అర్జున్ గెలిచి.. హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్ లో జరిగిన భోలే షావలి, ప్రియాంక, శోభా శెట్టిల మధ్య జరిగిన గొడవని కూల్ గా పరిష్కరించాడు నాగార్జున. అసలు అలా బూతులు వాడటం కరెక్టేనా అని భోలే షావలిని అడుగగా.. " ఆ డిస్కషన్ లో అలా మాటలు వచ్చాయి సర్. నా నైజం కాదు సర్. సారీ చెప్పాను సర్" అని భోలే షావలి తప్పుకి క్షమించమని చెప్పడంతో నాగార్జున సరే అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని లేపి భోలే షావలి తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నావంటే లేదని తను చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక జైన్ ని లేపి.. హౌస్ లో నువ్వు థూ అని అనడం అసలు కరెక్ట్ కాదని అలా ఇంకెప్పుడు అనకూడదని వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఎప్పటిలాగే టాస్క్ లో ఆట సందీప్ చేసిన ఫౌల్స్ గురించి చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత శివాజీ సంచాలకుడిగా తప్పు జరుగనివ్వడని తెలుసని, మీరు చేసే ఫౌల్స్ చూసాడని నాగార్జున అన్నాడు.
అంబటి అర్జున్ కెప్టెన్ అయ్యాక తను కూడా సీరియల్ గ్యాంగ్ లో ఒకడిలాగా ప్రూవ్ చేసుకున్నాడు. మీకు హౌస్ లో నిచ్చెన, పాము లు ఎవరని అడుగగా.. గౌతమ్ కృష్ణని నిచ్చెన అని, శివాజీని పాము అని అంబటి అర్జున్ అన్నాడు. హౌస్ లో అందరు అర్థమయ్యారని కానీ శివాజీ గారే అర్థం కాలేదని అంబటి అర్జున్ అన్నాడు. యావర్ కెప్టెన్సీ ఎలా ఉందని అడుగగా.. ది బెస్ట్ కెప్టెన్ అని హౌస్ అంతా అంగీకరించారు.