English | Telugu

అక్కని కొట్టిన చెల్లి.. అసలు ఇద్దరిలో తప్పెవరిది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -243 లో.. స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలియగానే ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రుద్రాణి, రాహుల్ ఇద్దరు కలిసి స్వప్నని ఇంట్లో నుండి బయటకు పంపేయాలని అంటారు. ఇక ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి రాలేనని భావించిన స్వప్న మరొక నాటకం మొదలు పెడుతుంది.

అంతా చేసి, ఇంత జరుగుతున్న సైలెంట్ గా ఉంటున్నావని కావ్యని స్వప్న అనగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక రుద్రాణి మాత్రం ఈ దెబ్బతో ఇంట్లో నుండి ఇద్దరిని బయటకు పంపించెయ్యవచ్చని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నువ్వు చేసి ఆ తప్పు నా మీద నెట్టేస్తున్నవేంటని కావ్య అంటుంది. నీ తప్పు కాదని చెప్పడానికి తన మీదకి నెట్టి వేస్తున్నావా అని రాజ్ అంటాడు. నాకు ఈ అబద్దం చెప్పమని సలహా ఇచ్చింది కావ్య, ఇదంతా తనకి తెలియదని అమ్మపై ఒట్టు వెయ్ అనగానే కావ్య ఒట్టు వెయ్యలేకపోతుంది. దాంతో అందరూ కావ్య మోసం చేసిందని అనుకుంటారు. ఇంట్లో నుండి బయటకు పంపించెయ్యండని రుద్రాణి అనగానే.. నాతో పాటు మీ అబ్బాయిని కూడా బయటకు పంపించాలి. ఎందుకంటే నేను తప్పు చేశాను కానీ ఆ తప్పు జరగడానికి కారణం రాహుల్.. ఒక నా కడుపు విషయం అబద్ధం కానీ నన్ను డబ్బున్నవాడిని అని చెప్పి మోసం చేసి లేపుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపిస్తే కోర్ట్ కి వెళ్తానని అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరదేవి ఇద్దరు అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుభాష్ కలుగుజేసుకొని ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అమ్మ, నాన్న మేం నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు ఎవరేం మాట్లాడకండి అని రుద్రాణిపై సుభాష్ కోప్పడి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత స్వప్నని గదిలోకి తీసుకెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. చేసిందంతా నువ్వు చేసి నా మీదకి తోస్తావేంటి.. నీలాగా ఉండడం నాకు చేత కాదని స్వప్న పొగరుగా మాట్లాడుతుంది. పెద్దవాళ్ళ అంటే గౌరవం లేదా అని స్వప్నని కావ్య తిడుతుంది. నాకు ఎవరితో సంబంధం లేదు. నేను ఎవరి గురించి పట్టించుకోను. నా సుఖం, సంతోషం మాత్రమే చూసుకుంటానని కావ్యతో స్వప్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.