English | Telugu

స్పెషల్ ఆఫీసర్ రాకతో కొత్త మలుపు.. టెన్షన్ లో వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -910 లో.. అనుపమ దగ్గరికి వాళ్ళ పెద్దమ్మ వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఇలా బాధపడడం బాలేదు. నీ జీవితాన్ని ఎక్కడ ఆపేసావో అక్కడికి వెళ్ళు. వాళ్ళని తల్చుకొని బాధపడడం ఎందుకు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్ని తెలుసుకోమని అనుపమకి వాళ్ళ పెద్దమ్మ సలహా ఇస్తుంది.

ఆ తర్వాత మహేంద్రకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోవాలని అనుపమ అనుకుంటుంది. మరొక వైపు రిషి, వసుధార, మహేంద్ర కలిసి భోజనం చేస్తుంటారు. మహేంద్ర లో వచ్చిన మార్పు చూసి రిషి, వసుధార ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.. ఆ తర్వాత మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంది. మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. అయిన అనుపమ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. మహేంద్ర కట్ చేస్తూనే ఉంటాడు. నా భోజనం అయిపొయింది అంటు మహేంద్ర వెళ్లి పోతాడు..

ఆ తర్వాత డాడ్ ఎందుకు ఫోన్ వచ్చాక అలా అయిపోయారు. అనుపమ అని పేరు వచ్చింది కాదా ఫోన్ లో, తనేనా అరకులో కలిసిన ఆమె కదా అని రిషి అనగానే.. అవునని వసుధార అంటుంది. అయిన ఆవిడ డాడ్ కీ ఎందుకు కాల్ చేసింది. మరి డాడ్ ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నాడని రిషి అంటాడు. తన నెంబర్ తీసుకొని కనుక్కోవాలని వసుధార అనగానే.. వద్దు డాడ్ తనంతట తాను చెప్పేవరకు ఓపిక పడదామని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొని మహేంద్ర దగ్గరికి వస్తుంది. రిషి ఎక్కడ అని అడుగుతాడు. వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడని వసుధార చెప్పగానే.. ఇప్పుడు అక్కడికి ఎందుకని మహేంద్ర అంటాడు.. ఆ తర్వాత వాళ్ళు చేసిన మోసాల గురించి మహేంద్ర గుర్తుకు చేసుకొని బాధపడుతాడు . అప్పుడే రిషి వెళ్తున్నానంటే నేను కూడా వస్తానని వసుధార అంటుంది. మామయ్య గురించి.. ఏం టెన్షన్ పడకండి మామయ్య గారు ఎక్కడికి వెళ్లారని వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషి, వసుధారని తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత రిషి, దేవయాని దగ్గరికి వెళ్ళగానే దేవయాని లేని ప్రేమని నటిస్తుంటుంది. రిషి వసుధారలు రాగానే శైలేంద్ర, ఫణింద్రలు వచ్చి మాట్లాడతారు. మీకోక వ్యక్తిని పరిచయం చెయ్యాలని ఫణింద్రకి రిషి చెప్తాడు. అప్పుడే అతను రిషికి ఫోన్ చేసి వస్తాడు.. అతని పేరు ముకుల్.. అమ్మ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని అతన్ని పరిచయం చేస్తాడు రిషి. అతన్ని చూడగానే దేవాయని, శైలేంద్ర ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత జగతి కేసు గురించి మాట్లాడుకుంటారు.‌ జగతిని రిషి కలుస్తున్నట్లు మాకు తప్ప ఎవరికీ తెలియదని రిషి అంటాడు. జగతి మేడమ్ ఫోన్ ట్రాప్ చేస్తే తెలుస్తుందని ఆఫీసర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.