English | Telugu
జ్యోత్స్నపై శివన్నారాయణ ఫ్యామిలీ సీరియస్.. దీపకి బెడ్ రెస్ట్!
Updated : Nov 23, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -522 లో... దీప చేతుల మీదుగా పూర్ణహుతి హోమంలో పడుతుంది. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏం చేసావే దీప అని పారిజాతం అంటుంది. తర్వాత మాట్లాడుకుందామని శివన్నారాయణ అంటాడు. పూజ పూర్తి అయినా అందరికి సుమిత్ర చేతుల మీదుగా వాయినం ఇచ్చి పంపిస్తుంది. చాలా థాంక్స్ పంతులు గారు దగ్గర ఉండి హోమం జరిపించారని శివన్నారాయణ అంటాడు. హోమం పూర్తవ్వలేదు. ఈ ఇంటి వారసురాలి చేతుల మీదుగా పూర్ణాహుతి వెయ్యాలన్నారు కానీ ఈ ఇంటిపని మనిషి చేతుల మీదుగా వేశారని జ్యోత్స్న అంటుంది.
కాంచన కోడలు అయింది కాబట్టి దీప ఇక్కడ ఉంది. తను ఒక అనాధ అని పారిజాతం అంటుంది. అలా ఎవరుండరు తన అమ్మనాన్నలు కూడ ఎక్కడో ఒక దగ్గర ఉంటారని పంతులు అంటాడు. ఆమె హోమంలో పూర్ణహుతి వెయ్యడంలో తప్పు లేదని పంతులు అంటాడు. ఈ దీప మంచి పని చేసిందని మెచ్చుకోవాలా అని దీపని జ్యోత్స్న నెట్టేస్తుంది. దాంతో దీప కింద పడిపోతుంది.
అందరు దీప దగ్గరికి వస్తారు. జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. దీపని బెడ్ పై పడుకో బెట్టి రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావని జ్యోత్స్నపై పారిజాతం కోప్పడుతుంది. నీకు ఇప్పుడే దీప అసలైన వారసురాలు అని చెప్తే అందరికి చెప్పేస్తావ్.. ఇప్పుడే చెప్పకూడదని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత స్వప్న అందరికి ప్రసాదం పెడుతుంది కానీ కాశీకి పెట్టదు. కాశీకి కూడా పెట్టు అని కార్తీక్ అనగానే స్వప్న అప్పుడు వెళ్లి కాశీకి పెడుతుంది. నార్మల్ గా ఉండొచ్చు కదా అని కాశీ అనగానే స్వప్న కోపంగా వెళ్తుంది. తన వెనకాలే కాశీ వెళ్తాడు. అదంతా కార్తీక్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.