English | Telugu

నర్మద వాళ్ల గుట్టురట్టు చేస్తానని శ్రీవల్లి స్కెచ్.. రామరాజుతో చెప్పగలదా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -323 లో.. నర్మద వాళ్ళ రూమ్ కి వెళ్లి శ్రీవల్లి హల్ టికెట్ కోసం వెతుకుతుంది. హలో టికెట్ దొరకగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ సంగతి మావయ్య గారికి చెప్తానని నర్మదని ఉద్దేశ్యించి శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు అమూల్య చదువుకుంటుంటే విశ్వ పిలుస్తాడు. ఒకసారి గోడ దగ్గరికి రావా ప్లీజ్.. నీతో మాట్లాడాలని అంటాడు. ఈ చీర నీ కోసం తీసుకొని వచ్చాను.. రేపు కట్టుకో నేను హ్యాపీగా ఫీల్ అవుతానని విశ్వ అంటాడు. మా వాళ్ళు చూస్తారు రానని అముల్య అంటుంది.

విశ్వ రిక్వెస్ట్ చెయ్యడంతో అమూల్య వస్తుంది. అమూల్యకి విశ్వ చీర ఇస్తుండగా.. అప్పుడే ధీరజ్ రావడం గమనించి చీర అక్కడే వదిలేసి ఇద్దరు దాక్కుంటారు. ధీరజ్ ఆ చీర చూసి చీర ఇక్కడ ఉంది ఏంటనుకొని చీర పట్టుకొని లోపలికి వస్తాడు. అప్పుడే అమూల్య వెళ్లి.. అన్నయ్య ఆ చీర మా ఫ్రెండ్ ఇచ్చింది. బ్యాగ్ లో నుండి కింద పడిందని అమూల్య అనగానే గిఫ్ట్స్ అలా నెగ్ లెట్ చేస్తారా అలా చెయ్యొద్దని ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ కోసం ధీరజ్ జ్యూస్ తీసుకొని వెళ్లి ఇస్తాడు. కాళ్ళు లాగుతున్నాయని ప్రేమ అంటే ధీరజ్ కాళ్ళు నొక్కుతాడు.

మరొకవైపు హల్ టికెట్ తీసుకొని శ్రీవల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్లి నర్మద తన భర్తని గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ చేపిస్తుందని శ్రీవల్లి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ గుట్టు రట్టు చేస్తానని వాళ్లకు శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఇంటికి వస్తుంది. అందరికి స్వీట్ చేసుకొని తీసుకువస్తుంది. ఏంటి స్పెషల్ అని రామరాజు అడుగగా.. చెప్తాను మావయ్య అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.