English | Telugu
సారీ చెప్పిన శివజ్యోతి...ఇంకోసారి ఇలా జరగదు అంటూ వీడియో రిలీజ్
Updated : Nov 23, 2025
తిరుమల ప్రసాదం గురించి తిరుమల క్యూ లైన్ గురించి నటి జ్యోతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో అందరూ జ్యోతక్కను ట్రోలింగ్ చేయడం తిట్టడం స్టార్ట్ చేశారు. దాంతో ఫైనల్ గా సారీ వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "తిరుపతి క్యూ లైన్ లో నేను మాట్లాడైన మాటలు చాల మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. ఎక్స్ప్లనేషన్ ఇచ్చేముందు నా మాటలకు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటె నిజంగా సారీ. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ నెలల తరబడి నేను శనివారాలు చేసిన ..వాటి గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. అనుకోకుండా దీని గురించి మాట్లాడుకున్నారు. ఏదైనా సరే నా సైడ్ నుంచి తప్పు జరిగింది. నా మాటలు తప్పుగా ఉన్నాయేమో కానీ నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అన్నాడు 10 వేల క్యూ లైన్ లో నిలబడి ప్రసాదం తీసుకునేటప్పుడు అంత కాస్ట్లీ లైన్ లో నిలబడ్డాం అని అన్నాను. ఇప్పుడు నేను ఎం చెప్పినా అది ఎక్స్ప్లనేషన్ లా ఉంటుంది కానీ నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకే నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం లేదు. నా వైపు నుంచి సారీ చెప్తున్నాను. నా తమ్ముడు తరపున కూడా అందరికీ సారీ. నా ఇంట్లో, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైనది నా బిడ్డ. నా బిడ్డను కూడా ఆయనే ఇచ్చాడు. నేను ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను. నేను అన్ని మతాల దేవుళ్లను మొక్కుతా అన్న విషయం నన్ను ఫాలో అయ్యే అందరికీ తెలుసు. ఈ రోజు నేను అనుభవించేది ఏదైనా ఆయన దయ లేకపోతె ఏదీ రాదు. అలాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను. ఐనా తెలిసో తెలియకో పొరపాటున మాట్లాడాను అందరికీ సారీ. ఇదేదో వీడియో పెట్టి కేసులు పెడతాం అన్నందుకు కాదు. నాకు కూడా అనిపించింది అలా మాట్లాడి ఉండకూడదు అని. అందుకే ఇలా వీడియో చేసి పెడుతున్నా. టిటిడి వాళ్లకు ప్రజలందరికీ మరోసారి సారీ...సారీ చెప్పినంత తప్పు ఒప్పు ఐపోతుందని కాదు. ఇంకోసారి ఇలా జరగదు అని మాటిస్తున్నా" అని చెప్పింది శివజ్యోతి.