English | Telugu

Karthika Deepam 2: దశరథ్ మనసు మార్చడానికి శివన్నారాయణ ప్లాన్.. శౌర్యకి చెల్లి రాబోతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -499 లో.....శివన్నారాయణ, కార్తీక్ ఇంటికి వస్తారు. మావయ్యతో అత్త గురించి చెప్పకని కార్తీక్ అనగానే చెప్పను కానీ ఈ రోజు మీ తాతయ్యలోని మరొక కోణం చూస్తావని శివన్నారాయణ అంటాడు. దశరథ్ బాధపడుతుంటే శివన్నారాయణ వెళ్లి ఎందుకు సుమిత్ర గురించి భాదపడుతున్నావ్.. నిన్ను అర్థం చేసుకోలేక వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ గురించి వెతకడం బాధపడడం అనవసరమని శివన్నారాయణ అంటుంటే పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు.

ఏంటి తాత అలా మాట్లాడుతున్నావని కార్తీక్ అంటాడు. నువ్వు డ్రైవర్ వి.. డ్రైవర్ లాగా ఉండు అంతేగాని ఎక్కువ మాట్లాడకని శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిన్నటి వరకు మమ్మీ గురించి బెంగ పెట్టుకొని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. బయటకు వెళ్ళాడు బావతో తిరిగి వచ్చాడు. అసలేం జరిగిందని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. మరొకవైపు కాశీ ఇంటికి వచ్చి ఆఫీస్ లో టైడ్ అయినట్లు బిల్డప్ ఇస్తుంటే.. శ్రీధర్ ఫోటో చూపిస్తాడు. రోడ్డుపై నీ ఫ్రెండ్ తో బాతకానీ కొడుతుంటే నేను అక్కడే ఉన్నాను.. అక్కడే ఉండి నీకు ఫోన్ చేసానని శ్రీధర్ చెప్తాడు. దాంతో కాశీ టెన్షన్ పడతాడు. కాశీ ఏదో మాట్లాడబోతుంటే నోరు ముయ్ రా అని శ్రీధర్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. స్వప్న నేనొక విషయం చెప్పాలని శ్రీధర్ అంటాడు. చెప్పకండి అని కాశీ మెల్లిగా రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో శ్రీధర్ సైలెంట్ గా ఉంటాడు.

ఆ తర్వాత అత్త, మావయ్యలని కలపాల్సింది పోయి. అలా మాట్లాడతావా అని శివన్నారాయణతో కార్తీక్ అంటాడు. దశరథ్ లో సుమిత్రపై ఉన్న ప్రేమని బయటకు తీసుకొని రావడానికి అలా మాట్లాడాను.. రేపు వాళ్ళ పెళ్లి రోజు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.. నువ్వు రేపు త్వరగా రారా అని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత శౌర్య బొమ్మ పట్టుకొని ఆ బొమ్మకి పేరు పెట్టమని దీప దగ్గరికి వస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ బొమ్మని చెల్లి అని పిలవమని చెప్తారు. ఆ తర్వాత శౌర్య చెల్లి కావాలని అంటుందని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. వెళ్లి పాల గ్లాస్ తో రా మనకి చాలా పనుంది అని కార్తీక్ అనగానే దీప సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.