English | Telugu

Brahmamudi : కావ్యని చూసి రాజ్ షాక్.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -862 లో... కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. నేనంటే ఎంత ఇష్టం నా కోసం మీ బిడ్డని వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నామని కావ్య అంటుంది. కావ్య వంక రాజ్ డౌట్ గా చూస్తుంటే.. ఏంటండి అలా చూస్తున్నారని కావ్య అడుగుతుంది.

నేను ఏమైనా డాక్టర్ తో అబద్ధం చెప్పించానా ఏంటి అలా చూస్తున్నారని కావ్య అనగానే.. నువ్వు డాక్టర్ ని రిక్వెస్ట్ చెయ్యడం నేను చూసానని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. కావ్య డాక్టర్ తో మాట్లాడింది రాజ్ గుర్తుచేసుకుంటాడు. ఎందుకు ఇలా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పావని రాజ్ అడుగుతాడు. మీరు ఎలా నా కోసం అబద్ధం ఆడారో.. నేను ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం అబద్ధం ఆడానని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కోపంగా ఉంటాడు. తన కోపం పోగొట్టడానికి తనకి చెక్కిలిగింతలు పెడుతుంది కావ్య‌. రాజ్ నార్మల్ అవుతాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు.

మరొకవైపు స్వప్న బీరువా ఓపెన్ చెయ్యడంతో తన నెక్లెస్ కన్పించదు.. దాంతో రాహుల్ ని పిలిచి నా నెక్లెస్ నువ్వు తీసావ్ రేపటి లోగా నెక్లెస్ తీసుకొని రాకుంటే మర్యాద ఉండదని రాహుల్ కి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నాకు కావలసింది కూడా ఇదేగా అని రాహుల్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య ఉదయం లేచి వ్యాయామం చేస్తుంది. అప్పుడే రాజ్ వస్తాడు. తరువాయి భాగంలో ఉదయం కావ్య మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తో రాజ్ దగ్గరికి వస్తుంది. ఇదంతా ఏంటే అని రాజ్ అడుగగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.