English | Telugu
Karthika Deepam2 : కార్తీక్ కి శివన్నారాయణ బంపర్ ఆఫర్.. జ్యోత్స్న ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే!
Updated : Jun 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -391 లో..... పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేసి గొడవ గురించి అడుగుతాడు. ఇక నా కొడుకు గెలిచాడు కదా.. ఆ శివ మామని ఒక ఆట ఆడుకుంటాడని శ్రీధర్ అంటుంటే.. పారిజాతం చిరాకుగా ఫోన్ కట్ చేస్తుంది. కార్తీక్ వర్కర్స్ సమస్యని పరిష్కారించినందుకు ఏం కావాలో అడగమని శివన్నారాయణ అడుగతాడు.
దాంతో కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్తాడు. చూశావా వాడు అవకాశవాది అని శివన్నారాయణ అంటుండగా.. అని అంటాననుకున్నావా అగ్రిమెంట్ గురించి కాదని ట్విస్ట్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత శివన్నారాయణ కార్తీక్ కి బ్లాంక్ చెక్ ఇస్తాడు. దాంతో ఎక్కడ ఎన్ని కోట్లు రాస్తాడో అని పారిజాతం టెన్షన్ పడుతుంది. కానీ కార్తీక్ మళ్ళీ ఆ బ్లాంక్ చెక్ జ్యోత్స్న కి ఇస్తాడు. అందులో జ్యోత్స్న ఒక్క రూపాయి రాసి.. ఇది నువ్వు ఇచ్చే అమౌంట్ లో కట్ చేసుకోమని పొగరుగా సమాధానం చెప్తుంది.
అలా ఎందుకని దశరథ్ అంటాడు. తప్పేముంది వాడికి బ్లాంక్ చెక్ ఇచ్చాను తిరిగి ఇచ్చాడు.. తప్పు వాడిది అని శివన్నారాయణ అంటాడు. కానీ మనకి సాయం చేసాడు కాబట్టి వాళ్ళు రోజు సైకిల్ పై ఇబ్బంది పడుతూ రావడం ఎందుకు.. స్కూటీ ఉంది కదా తీసుకోండి అని శివన్నారాయణ అనగానే దీప, కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ జరిగింది మొత్తం ఇంటికి వెళ్లి కాంచనకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.