English | Telugu

Karthika Deepam2 : శౌర్యని హాస్పిటల్ కి తీసుకొచ్చిన కార్తీక్.. ఏదో దాస్తున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -261 లో.... కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. శౌర్యని ఈ రోజే హాస్పిటల్ లో అడ్మిట్ చెయ్యమని చెప్తాడు. దాంతో కార్తీక్ ఇంటికి వెళ్లి శౌర్యని తన ఫ్రెండ్ ఇంట్లో ఉంచుతున్నానని దీపకి చెప్తాడు. దాంతో దీపకి ఇష్టం లేకున్నా బట్టలు సర్దుతు ఉంటుంది. కార్తీక్ డబ్బు తీసుకుంటుంటే ఇప్పుడు డబ్బు ఎందుకని దీప అడుగగా.. ఫ్రెండ్ కి ఇవ్వాలని కార్తీక్ అంటాడు.

కానీ దీప డౌట్ గానే ఉంటుంది. శౌర్యని విడిచి ఉండలేను. నేను రానని చెప్పు శౌర్య అని దీప అంటుంది. నాన్నతో వెళ్తాను అమ్మ అని శౌర్య చెప్తుంది. శౌర్య, దీప ఇద్దరు ఎమోషనల్ అవుతారు. శౌర్యని తీసుకొని సైకిల్ పై హాస్పిటల్ కి బయల్దేరతాడు కార్తీక్. దారిలో గుడి దగ్గర ఆగి శౌర్యా, కార్తీక్ ఇద్దరు మొక్కుకుంటారు. మనం ఇప్పుడు వెళ్ళేది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు.. నేను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని కార్తీక్ చెప్పగానే శౌర్యా సరే అంటుంది. అనసూయ, కాంచన ఇద్దరు కార్తీక్ గురించి మాట్లాడుకుంటారుమ చిన్నప్పుడు కార్తీక్ చేసిన మంచి పనిని అనసూయకి చెప్తుంది కాంచన. అందుకే కార్తీక్ ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. అందుకే నేను అడ్డు చెప్పనని కాంచన అంటుంది.

ఇప్పుడు కార్తీక్ బాబు శౌర్య గురించి ఏదో దాస్తున్నాడు. తను ఒక్కడే ఆ బాధను భరిస్తున్నాడని అనసూయ అంటుంది. మరోవైపు శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు కార్తీక్. అక్కడ కాశీ ఉంటాడు. శౌర్యా వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు రోజు టాబ్లెట్ వేసుకుంటున్నావ్ కదా ఇక వేసుకునే అవసరం ఉండదని కార్తీక్ చెప్పగానే.. శౌర్య సరే అంటుంది. ఈ విషయం అమ్మ కి చెప్పొద్దూ.. నేను కాశీ మావయ్య ఉంటామని కార్తీక్ చెప్తాడు. దానికి శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.