English | Telugu

Karthika Deepam2 : దీప మీద అరిచేసిన కార్తీక్.. దాస్ గురించి జ్యోత్స్న టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -259 లో.....కాంచన, అనసూయ, శౌర్యలు సరదాగా మాట్లాడుకుంటారు. కార్తీక్ బాబు ఇంకా రాలేదని దీప అనగానే.. వాడు ఇందాకే వచ్చాడని కాంచన చెప్తుంది. దీప గదిలోకి వెళ్తుంది. అక్కడ అలమరాలో డబ్బు కన్పిస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇంత డబ్బు ఎక్కడిది అని దీప అడుగగా.. రెస్టారెంట్ కి అని చెప్పాను కదా అని కార్తీక్ చెప్తాడు. అయిన దీప గుచ్చిగుచ్చి అడుగుతుంటే దీపపై అరుస్తాడు కార్తీక్.

కార్తీక్ గట్టిగా అరవడంతో అప్పుడే కాంచన వచ్చి.. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావని అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అంటాడు. అదేంటీ డబ్బు గురించి రెస్టారెంట్ గురించి వాళ్ళ అమ్మతో చెప్పాడం లేదని దీప అనుకుంటుంది. అప్పుడే దాస్ కన్పించడం లేదన్న విషయం కాంచన, దీపలకి చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత సారీ దీప, శౌర్య గురించి చెప్తే తట్టుకోలేవు.. అందుకే చెప్పడం లేదని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శ్రీధర్ తన అందం గురించి తానే పొగుడుకుంటూ ఉంటాడు. అప్పుడే కావేరి వచ్చి వియ్యంకుడు కన్పించడం లేదంట ఒకసారి వెళదామని అంటుంది. దాంతో శ్రీధర్ తనపై చిరాకుపడతాడు.

ఆ తర్వాత స్వప్న, కాశీలు కార్తీక్ ఇంటికి వస్తారు. నాకూ ఒక సాయం చేస్తావా మూడు రోజుల నుండి కార్తీక్ బాబు తేడాగా కన్పిస్తున్నారు.. తన ఫ్రెండ్ దగ్గర అయిదు లక్షలు తెచ్చాడని దీప అనగానే.. అవి నా దగ్గర తీసుకున్నాడు కానీ చెప్పొద్దన్నాడు అని కాశీ అనుకుంటాడు. కార్తీక్ బాబు ఏదో దాస్తున్నాడు ఆ డబ్బు గురించి నీకేమైనా తెలుసా అని దీప అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. కాసేపటికి కాశీకి కానిస్టేబుల్ కాల్ చేసి మీ నాన్న హాస్పిటల్ లో ఉన్నాడని చెప్తాడు. దాంతో కార్తీక్, కాశీలు హాస్పిటల్ కి వెళ్తారు. మరొకవైపు దాస్ హాస్పిటల్ లో ఉన్న విషయం పారిజాతం ఇంట్లో వాళ్లకు చెప్తుంది. దాంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావని దశరథ్ అంటాడు. పారిజాతం వెళ్తుంటే నేను వస్తానంటూ జ్యోత్స్న వెళ్తుంది. మరొకవైపు దాస్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తారు. అక్కడ డాక్టర్.. దశరథ్ సేవ్ చేసిన విషయం చెప్పడు. ఆ తర్వాత దాస్ ని ఇంటికి తీసుకొని వెళ్తారు. దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతూ.. తనని కొట్టినవాళ్ళని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.