English | Telugu

Karthika Deepam2 : మామయ్య అక్రమ సంబంధం చూసి జ్యోత్స్న షాక్.. ఆమె ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -154 లో..... కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీ అమ్మగారికి నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుందని దీప అనగానే.. మా నాన్నని దేవుడు అనుకుంటుంది అమ్మ.. ఇప్పుడు ఈ విషయం చెప్తే తట్టుకోలేదని కార్తీక్ అంటాడు. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని కాంచన అంటుంది. అంతా వినేసిందా అని కార్తీక్ , దీపలు టెన్షన్ పడుతారు. ఏంటి ఏదో నిజం తట్టుకోలేదనుకుంటున్నారని కాంచన అంటుంది. అదేం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మ మీకు ఇలా కాళ్ళు లేకున్నా గుండె దైర్యంతో బ్రతుకుతున్నారు. అదే మనసుకి గాయమైతే తట్టుకుంటారా అని దీప అడుగుతుంది.

నా భర్త నా కొడుకు వీళ్ళ విషయం లో ఏం జరిగిన నేను తట్టుకోలేను దీప అని కాంచన అంటుంది. అమ్మకి నాన్న రెండో పెళ్లి విషయం ఎప్పటికి తెలియనివ్వకూడదని కార్తీక్ అనుకుంటాడు. మీకు నిజం తెలియకుండా జాగ్రత్త పడాలని దీప అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతంలు కాశీ చెప్పిన ప్లేస్ కి వస్తారు. నన్ను ఎందుకు పిలిచారని జ్యోత్స్న అంటుంది. ఎంతైనా కాశీ నీ తమ్ముడు అని పారిజాతం అనగానే.. అలాంటి డైలాగ్ కొట్టకు.. నేను సుమిత్ర, దశరత్ ల కూతురిని అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కాశీ వస్తాడు. అదే స్వప్న వాళ్ళ ఇల్లు ఎలాగైనా మా పెళ్లికి మీరే వాళ్ళ నాన్నని ఒప్పించాలని కాశీ అంటాడు. సరే అంటూ పారిజాతం వెళ్తుంటే.. శ్రీధర్ ఫోన్ మాట్లాడుతూ కన్పిస్తాడు. అతన్ని చూసి పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్నకి చూపిస్తుంది. అతనే మా మావయ్య అని కాశీ చెప్తాడు. అప్పుడే కావేరి వస్తుంది. తను మా అత్తయ్య అని చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు.

నాకేం అర్థం అవ్వడం లేదని జ్యోత్స్న అనగానే.. నాకు అర్థం అయిందని పారిజాతం అంటుంది. కాశీ నువ్వు వెళ్ళు మేం మాట్లాడుకుంటామని అతన్ని పారిజాతం పంపిస్తుంది. మావయ్య ఏంత మోసం చేసాడని జ్యోత్స్న అంటుంది. ఈ విషయం తాతయ్యకి చెప్తానని జ్యోత్స్న అనగానే.. ఇప్పుడు చెప్తే కార్తీక్ తో నీ పెళ్లి జరగదు. ఇప్పుడు మనం ఒకరిని కలవాలని చెప్పి జ్యోత్స్నని తీసుకొని వెళ్తుంది పారిజాతం. మరొక వైపు కార్తీక్ మెల్లిగా నడుస్తుంటాడు. దీప పక్కనే ఉండి జాగ్రత్త చెప్తుంది. కార్తీక్ సెట్ అవ్వడంతో కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.