English | Telugu

మణికంఠ హగ్గు భాగోతం.. నువ్వు చేసే పనులేంట్రా అంటూ నెటిజన్లు ఫైర్!

బిగ్‌బాస్ హౌస్ లో‌ నాగ మణికంఠ బిహేవియర్ మరీ వరెస్ట్ గా ఉంది.‌ ఎంతలా అంటే లేడి కాంటెస్టెంట్స్ తో అతను ప్రవర్తిస్తున్న తీరు‌ వైరల్ గా మారింది.‌ అసలేం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం.

ప్రభావతి టాస్క్ మధ్యలో కాస్త గేమ్ పాజ్ అయినప్పుడు..‌బయట ఉన్న ‌సోనియాని లోపలికి తీసుకెళ్ళాడు మణికంఠ. ఇక అక్కడికెళ్ళాక‌ అటు‌ ఇటు‌ చూడగా.. ఏంట్రా మ్యాటర్ చెప్పమని సోనియా అడిగితే నాకు ఒక హగ్గు కావాలి అక్కా అంటూ బాంబు పేల్చాడు మణికంఠ. దీనికి కాస్త షాకైన సోనియా ఏం కావాలంటూ మళ్లీ అడిగింది. అయినా సరే నాకు హగ్గు కావాలంటూ మళ్లీ అడిగాడు మణికంఠ. వామ్మో.. నేను గేమ్ ఆడాలిరా ఇప్పుడు.. హగ్గు ఇస్తే ఎనర్జీ అయిపోతుందంటూ సోనియా అంది. దీనికి నవ్విన మణికంఠ.. ఏంటో ఏడ చూసినా కెమెరాలే ఉన్నాయంటూ దిక్కులు చూశాడు. కాసేపటికే సరే రా అంటూ సోనియా ఓ టైట్ హగ్గు ఇచ్చింది.

అయితే ఇక్కడ అక్కా అక్కా అంటూ వెంటపడుతూ హగ్గులేందిరా అయ్యా అంటూ నెటిజన్లు మణికంఠను ఉతికారేస్తున్నారు. ఏదో బాధలో ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని ఓదారిస్తే ఓ అర్థం ఉంది కానీ మాటిమాటికి ఇలా వచ్చి హగ్గు కావాలంటూ తీసుకోవడం ఏంటో అర్థం కాలేదు. ఇదేదో ఒక్కసారి జరిగితే ఓకే కానీ మొన్నా మధ్య ఇలానే సోనియా బుగ్గ మీద అందరి ముందూ ఓ కిస్ కూడా ఇచ్చాడు మణికంఠ. అలానే నైనికకి కూడా మొదట్లో ఓ ముద్దు ఇచ్చాడు. రీసెంట్‌గా యష్మీ వద్దన్నా మణికంఠ వెనకాల నుంచి వాటేసుకున్నాడు.

ఇక హౌస్ లో మణికంఠ వేషాలు చూసి నైనిక గడ్డి పెట్టింది. నువ్వు ఇక్కడ అందిరితోనూ ప్రేమలో ఉన్నావ్ అంటూ నైనిక అంది. దీనికి అది ప్రేమ కాదు ఎఫెక్షన్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు మణికంఠ. కానీ నైనిక మాత్రం వదల్లేదు. మరి అందరితో వద్దమ్మా.. నీకు వైఫ్ ఉన్నప్పుడు వైఫ్‌తో ఉండాలి.. ఇలా ముద్దులు పెడుతూ హెల్తీ ఫ్లర్టింగ్ అనకూడదు.. పెళ్లి అయిన తర్వాత ఫ్లర్టింగే ఉండకూడదంటూ నైనిక చెప్పగా మణికంఠ మొఖం మాడ్చేశాడు.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.