English | Telugu
Karthika Deepam2 : పెళ్ళికి ఒప్పుకున్న కార్తీక్.. కాశీకి సాయం చేసిన దీప!
Updated : Aug 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -129 లో... సుమిత్ర వాళ్ళ ఇంట్లోకి కార్తీక్ వెళ్లి అందరిని పిలుస్తాడు. అందరు రాగానే.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఒకరికి జీవితం ఇవ్వడానికి సంబంధించినదని అనగానే దీపకి జీవితం ఇస్తానని చెప్తూడేమోనని పారిజాతం, జ్యోత్స్నలు టెన్షన్ పడతారు. ఒకసారి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది.. ఎంగేజ్ మెంట్ మనకి అచ్చి రాలేదని కార్తీక్ అంటాడు. ఇంకొకసారి చేసుకోవచ్చని పారిజాతం అంటుంది. అవసరం లేదు ఇక ఎంగేజ్ మెంట్ లేదు డైరెక్ట్ పెళ్లికి ముహూర్తం పెట్టండి అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఎప్పుడు ఇలా టెన్షన్ పెట్టి సర్ ప్రైజ్ ఇస్తావ్ అని పారిజాతం అంటుంది. నేను శౌర్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తానని కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను గుడికి వెళ్తానంటూ దీప వెళ్ళిపోతుంది. మనం కూడ గుడికి వెళదామని పారిజాతం హడావిడి చేస్తుంది. రెడీ అయి వస్తానంటు జ్యోత్స్న అంటుంది. మరొక వైపు స్వప్న బాయ్ ఫ్రెండ్ కాశీ ఇంటర్వ్యూ కి వెళ్తుంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. నీకు కచ్చితంగా జాబ్ వస్తుందని స్వప్న చెప్పగానే.. నాకు ఎదరు రా అని కాశీ అంటాడు. నేను ఎదరు వస్తే మంచి జరగదని స్వప్న అంటుంది. అయిన కాశీ వినకుండా రమ్మని అనగానే స్వప్న వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు మనం గుడికి వెళ్లడం లేదు.. నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కాశీ పక్కన పడిపోయి ఉంటాడు. అక్కడున్నా వాళ్ళు జ్యోత్స్న కార్ ఆపుతారు. అయిన జ్యోత్స్న నాకేంటి అన్నట్లు వెళ్ళిపోతుంది. అప్పుడే దీప ఆటో లో వెళ్తుంటే పడిపోయి ఉన్న కాశీని ఆటోలో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అదంతా ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు.
అ తర్వాత శౌర్యని తీసుకొని కార్తీక్ వస్తుంటే.. అప్పుడే కాశీని దీప తీసుకొని రావడం శౌర్య చూసి అమ్మ అంటూ కార్తీక్ కి చెప్తుంది. ఎవరతను అని కార్తీక్ అడుగగా.. ఎవరో తెలియదని చెప్తుంది. అతడిని చూసి డాక్టర్ ట్రీట్ మెంట్ చెయ్యను అంటాడు. కార్తీక్ చేయమని చెప్పగానే సరేనని డాక్టర్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్ తో కలిసి కార్తీక్ పెళ్లికి ఒప్పుకున్నాడుంటూ చెప్తుంది. మరొకవైపు స్వప్న సోషల్ మీడియాలో... సాయం చెయ్యని మిస్ హైదరాబాద్ జ్యోత్స్న.. సాయం చేసిన సాటి మనిషి అంటూ కాశీ గురించి న్యూస్ రావడం చూస్తుంది. కాశీని వీడియోలో చూసి స్వప్న షాక్ అవుతుంది. వెంటనే దీపకి ఫోన్ చేసి.. నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత శౌర్య గురించి కార్తీక్ ని దీప అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.