English | Telugu

మోనిత జైలుకు వెళ్లినా... కార్తీక్ ఫ్యామిలీకి టెన్షన్ ఎందుకంటే?

మోనిత అరెస్టుతో కార్తీక్, దీప కుటుంబానికి ఇక ఎటువంటి అడ్డు లేదని... కథ సుఖాంతం అవుతుందని భావించిన వీక్షకులకు 'కార్తీక దీపం' సీరియల్ దర్శకుడు ట్విస్ట్ ఇస్తున్నాడు. కథను మరింత కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తాజా ఎపిసోడ్స్ ద్వారా స్పష్టం చేస్తున్నాడు. కార్తీక్ ఫ్యామిలీకి మోనిత అడ్డు ఇంకా తగ్గలేదని టెన్షన్ తప్పదని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశాడు.

మోనితను కార్తీక్ హత్య చేశాడని అభియోగం మీద పోలీసులు అతడిని అరెస్టు చేయడం, సరిగ్గా తీర్పు వెలువరించే సమయంలో ఎవరినైతే తన భర్త హత్య చేశాడని అంటున్నారో ఆమెను కోర్టులోకి దీప తీసుకురావడంతో కథ మొత్తం మారిపోయింది.‌ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు కోర్టు సమయాన్ని వృథా చేయడంతోపాటు హత్యకు గురైన నాటకాన్ని ఆడిన మోనితకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

కార్తీక్ ఇంటికి... మోనిత జైలుకు వెళ్లడంతో వంటలక్క అలియాస్ దీప జీవితంలో ఎటువంటి టెన్షన్ లేదని అభిమానులు హ్యాపీ ఫీలయ్యారు.‌ అయితే, కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ ఈ పద్ధతుల ద్వారా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డను అడ్డుపెట్టుకుని ఎలాగైనా కార్తిక్ చేత తాళి కట్టించుకుని ప్రయత్నం చేస్తుందని కార్తీక్ తల్లి సౌందర్య అనుమానపడుతుంది. అదేవిధంగా మోనిత కూడా జైలు నుంచి కార్తీక్ ఇంటికి రత్నసీత చేత ఒక బ్యాక్ పంపిస్తుంది. అందులో చిన్న పిల్లల ఫోటోలు ఉంటాయి. మనకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటాడని, ఈ ఫోటోలో మీ పడక గదిలో అంటిస్తే సంతోషిస్తానని, ప్రతి అడుగులోనూ గుర్తొస్తున్నావని, మన బాబు కి మీ నాన్నగారి పేరు ఆనంద్ పెట్టానని మోనిత ఓ లేఖ రాస్తుంది. చివర్లో ఇట్లు నీ సహధర్మచారిణి 2 అని పేర్కొంటుంది. అలాగే దీప ఫోనులో తాను బెదిరింపులకు పాల్పడిన వీడియోలను రత్న సీత చేత డిలీట్ చేయిస్తుంది. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది. తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.