English | Telugu

మోనితను చంప‌డానికి వెళ్లిన కార్తీక్.. ఏం జ‌రిగింది?

'కార్తీక దీపం'లో కథ కొత్త పుంతలు తొక్కుతోంది. మరింత ఉత్కంఠగా మారుతోంది. మోనిత స్వయంగా తాను చేసిన నేరం గురించి అంజికి చెబుతున్న సమయంలో వంటలక్క వీడియో తీసిన సంగతి తెలిసిందే. దానిని డాక్టర్ బాబుకు చూపిస్తుంది. అప్పుడు ఆవేశంగా మోనిత ఇంటికి డాక్టర్ బాబు వెళతాడు. అక్కడ ఏం చేశాడు? అనేది ఇవాళ్టి (ఆగస్టు 07, 1112) ఎపిసోడ్‌లో మెయిన్ పాయింట్. అయితే, ఈ మధ్యలో ఏం జరిగింది? నేటి ఎపిసోడ్ విశేషాలు ఏంటి? అనేది చదవండి మరి!

ఎట్టిపరిస్థితుల్లోనూ కార్తీక్ చేత 25వ తేదీన తన మెడలో మూడు ముడులు వేయించుకుంటానని మోనిత శపథం చేసిన సంగతి తెలిసిందే. అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే, వంటలక్క మాత్రం బయటకువెళ్లిన భర్త ఎప్పుడొస్తాడా? అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ రానే వస్తాడు.

'హమ్మయ్య... వచ్చేశారా? మోనిత గురించి అంజి చెప్పిన నిజం తెలుసుకుని మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అని కంగారుపడ్డాను' అని వంటలక్క అంటుంది. అందుకు కార్తీక్ 'అంజి ఏం చెప్తాడు. ఇంతకు ముందు చెప్పిందే చెప్పాడు. వాడు వస్తాడు... వస్తాడు అని ఎదురుచూస్తే వాడొచ్చి చెప్పింది ఇదా' అంటాడు. 'మీరు అంజిని నమ్మలేదా? నన్ను నమ్మలేదా?' అని వంటలక్క అడుగుతుంది. తాను మోనితను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి, ఆ కడుపుతో తనకు సంబంధం లేదని చెప్పడానికి అంజి చెప్పిన సాక్ష్యం చాలదని కార్తీక్ నిరాశ వ్యక్తం చేస్తాడు. మోనిత నిజస్వరూపం బయటపడితే, ఏసీపీ రోషిణి మేడమ్ పెళ్లి ఆపేస్తుందని వంటలక్క అంటుంది. 'పెళ్లి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నానని రోషిణి మేడమ్ అనుకుంటే?' అని కార్తీక్ అనుమాన్యం వ్యక్తం చేస్తాడు. అప్పుడు మోనిత నేరం ఒప్పుకున్న వీడియోను అతడికి వంటలక్క చూపిస్తుంది.

'నాకు అర్థమైంది. మీరు సాక్ష్యం ఉంటే తప్ప దేనినీ సీరియస్ గా తీసుకోరు అని' అని వంటలక్క సీరియస్ అవుతుంది. 'నేను కాదు... రోషిణి మేడమ్ తీసుకోదు. అంత తేలిగ్గా దేనినీ నమ్మదు' అని కార్తీక్ బదులు ఇస్తాడు. అప్పుడు 'ఆవిడే కాదు, మీరు కూడా నమ్మే సాక్ష్యం నా దగ్గర ఉంది' అని వీడియో చూపిస్తుంది. హిమను చంపించానని మోనిత చెప్పిన మాటలు విని కార్తీక్ ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు. ఈ వీడియో రోషిణి మేడమ్ కు చూపిస్తే అన్నీ ఆవిడ చూసుకుంటుందని వంటలక్క అంటుంది. ఇక మోనిత గురించి టెన్షన్ పడొద్దని చెప్పి, భర్తకు మంచినీళ్లు తీసుకురావడానికి లోపలకు వెళ్తుంది. వచ్చేసరికి కార్తీక్ అక్కడ ఉండదు. కాల్ చేస్తే 'భారతి ఫ్రెండ్ చనిపోయాడట. చూడ్డానికి వెళ్తున్నా' అని చెప్తాడు. కానీ, అతడు వెళ్ళింది మాత్రం మోనిత దగ్గరకు.

'నేను వెళుతున్నది చనిపోయిన వాళ్ళను చూడటానికి కాదు. చంపిన మోనితను చంపడానికి. నీకు అబద్ధం చెప్పా దీప' అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప కూడా భర్త తనకు అబద్ధం చెప్పాడని అనుకుంటుంది.

మోనిత ఇంటికి కార్తీక్ వెళతాడు. అతడిని చూసి మోనిత సంతోషపడుతుంది. ఎందుకంటే అప్పటివరకు ఏసీపీ రోషిణి మేడమ్ దగ్గరకు వెళ్లి అంజి నిజం చెబితే తన పరిస్థితి ఏమవుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. 'నువ్ వస్తావని నాకు తెలుసు కార్తీక్. నువ్వెంత మండివాడివి. నా ప్రేమ, తపన, ఆశ... అన్నీ అర్థం చేసుకుని నా కోసం వచ్చావా... రా కార్తీక్! నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా వచ్చావు కదూ? పెళ్లితో జవాబు చెప్పడానికి వచ్చావు కదూ?' అని సంతోషంతో ఉప్పొంగుతుంది. ఆమె మాటలకు కార్తీక్ అడ్డుకట్ట వేస్తాడు.

'నోరు ముయ్యవే' అని మోనితపై ఆవేశంగా అరుస్తాడు కార్తీక్. 'ఏంటబ్బా... అప్పుడే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్?' అంటుంది. 'ఎవరే పెళ్ళాం? నా పెళ్ళాం పేరు దీప. చచ్చేదాకా తనే నా పెళ్ళాం. నీలాంటి మోసగత్తెలు వందమంది వచ్చినా నా కాలి గోటితో సమానం' అని కార్తీక్ అంటాడు. తన కబుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రినని ఒప్పుకోవాల్సిందేనని కార్తీక్ తో మోనిత అంటుంది. అదే పరిష్కారమని చెబుతుంది.

'పరిష్కారం పెళ్లి కాదు, నీ చావు' అని కార్తీక్ ఆవేశంతో ఊగిపోతాడు. 'ఏం అన్నావ్? చావా? నేను ఎలా చేస్తాను? ఎందుకు చస్తాను??' అని మోనిత అడుగుతుంది. 'ఇప్పుడే నా చేతుల్లో చస్తావ్. నన్ను ప్రేమించినందుకు చస్తావ్. హిమను దారుణంగా చంపించినందుకు నిన్ను చంపాలని వచ్చాను' అని కార్తీక్ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది. మరి, మోనితను కార్తీక్ చెంపేశాడా? లేదా? అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి. అందులో ఆడియన్స్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.