English | Telugu
బిగ్ బాస్ 5.. షణ్ముఖ్ జస్వంత్‌కు క్రేజీ ఆఫర్!
Updated : Aug 6, 2021
యూట్యూబర్‌గా షణ్ముఖ్ జస్వంత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ అతడి ఫాలోయర్స్ సంఖ్య తక్కువేమీ కాదు. తన వీడియోలతోనే కాకుండా, ఇతరత్రా కూడా షణ్ముఖ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. యూట్యూబ్‌లో అతడు క్రియేట్ చేసే రికార్డులను, యూత్‌లో అతడికున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నారు. మునుపటి సీజన్లకు తనకు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ అసంతృప్తి కలిగించడంతో అతను ఆ షోలో భాగం కావడానికి అంగీకరించలేదు.
దాంతో బిగ్ బాస్ 5 సీజన్‌కు అతడిని ఎలాగైనా తీసుకురావాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం భారీ మొత్తాన్నే అతడికి ఆఫర్ చేశారనీ, తను ఊహించిన దానికి మించి ఆఫర్ రావడంతో షణ్ముఖ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లూ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు అందరికంటే అతడికే ఎక్కువ రెమ్యూనరేషన్ ముడుతున్నట్లు, అది కోటి రూపాయల దాకా ఉంటుందన్నట్లు చెప్పుకుంటున్నారు.
నాలుగో సీజన్‌లో ఎక్కువ పాపులర్ ఫేస్‌లు లేవనే విమర్శలు రావడంతో, ఈసారి వార్తల్లో వ్యక్తుల మీదనే ఆర్గనైజర్స్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, టీవీ బ్యూటీ నవ్య స్వామి, సినీ తారలు ఇషా చావ్లా, పూనమ్ బజ్వా, కొరియోగ్రాఫర్ ఆనీ లాంటి వారు వెళ్లనున్నట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. అదే నిజమైతే బిగినింగ్ నుంచే 5వ సీజన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అంతమంది సెలబ్రిటీల్లో షణ్ముఖ్‌కే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కుతుండటం టాక్ ఆఫ్ ద టౌన్. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే బిగ్ బాస్ 5 తెలుగు సెప్టెంబర్ 5న మొదలయ్యే అవకాశాలున్నాయి.