English | Telugu

Karthika Deepam2 : దీప ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -523 లో..... స్వప్న, కాశీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అసలు ఏమైందని కార్తీక్ అడుగుతాడు. కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య అని స్వప్న చెప్తుంది. జరిగిందంతా స్వప్న చెప్తుంది. అలా అపార్ధం చేసుకోవద్దని ఇద్దరికి కార్తీక్ నచ్చజెప్పుతాడు. అప్పుడే దాస్ వస్తాడు. స్వప్న, కాశీ ని అక్కడ నుండి పంపిస్తాడు. నాకు వీళ్ళ గురించి టెన్షన్ లేదు.. దీప గురించి టెన్షన్ ఉంది.. ఇంకెన్ని రోజు లు జ్యోత్స్న టార్చర్ భరిస్తావని దాస్ అంటాడు.

ఇప్పుడు నేను ముందు చేసే పని ఒకటి ఉంది.. మా అమ్మనాన్నలని కలపాలని కార్తీక్ అంటాడు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి మాట్లాడుతాడు. కాంచన బొట్టు పక్కకి వెళ్తుంది. దాంతో శ్రీధర్ బొట్టు పెడుతాడు. అప్పుడే కావేరి వస్తుంది బొట్టు పక్కకి వెళ్తే పెట్టానని శ్రీధర్ అంటాడు. నాకెందుకు చెప్తున్నారని కావేరి అంటుంది. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇచ్చి ఎన్నటికి ఉన్నా అక్క చెల్లెలు ఒక్కటే నువ్వు వేరే అని శ్రీధర్ ని ఉద్దేశ్శించి పారిజాతం అంటుంది. ఆ తర్వాత కాశీ, స్వప్నలని తీసుకొని వెళ్ళమని కావేరిని శ్రీధర్ పంపిస్తాడు. ఆ తర్వాత దీపకి సుమిత్ర జ్యూస్ తాగిస్తుంటే తను వాంథింగ్ చేసుకుంటుంది. దాంతో డాక్టర్ కి ఫోన్ చెయ్యమని శివన్నారాయణ చెప్తాడు.

ఆ తర్వాత రాత్రి అమ్మ కలలోకి వచ్చిందని కాంచన చెప్తుంది. నాక్కూడా వచ్చిందని శివన్నారాయణ అంటాడు. నేను మీ మధ్యకి వస్తున్నానని చెప్పిందని కాంచన చెప్తుంది. రాబోయే సంఘటనలు ఇలా ముందే ఉహగా వస్తాయని పంతులు అంటాడు. అప్పుడే దీపని తీసుకొని సుమిత్ర, డాక్టర్ వస్తారు. కార్తీక్ తండ్రి కాబోతున్నాడు.. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరు సంతోషపడుతారు. జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.