English | Telugu
Illu illalu pillalu : పిల్లల ఇష్టాలని తెలుసుకోండి.. కన్నతండ్రికి ఎదురుతిరిగిన కొడుకు!
Updated : Nov 25, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో..... శ్రీవల్లి అందరికి స్వీట్స్ తీసుకొని వస్తుంది. మీరు తినండి ముందు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తానని అంటుంది. ఏంటని రామరాజు అడుగుతాడు. సాగర్ మరిది గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని శ్రీవల్లి అనగానే.. అందరు షాక్ అవుతారు. సాగర్ కి గవర్నమెంట్ జాబ్ రావడం ఏంటి వాడికి జాబ్ చెయ్యాలని ఉంటే నాకు చెప్తాడు కదా అని రామరాజు అంటాడు.
శ్రీవల్లి పేపర్ తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తుంది. అందులో సాగర్ పేరు ఉందని అంటుంది. అమూల్య చూసి అన్నయ్య క్వాలిఫై కాలేదు వదిన అని చెప్తుంది. జాబ్ రాలేదు కానీ ట్రై చేసాడు కదా అని శ్రీవల్లి అంటుంది. అది నిజమేనా అని సాగర్ ని రామరాజు అడుగుతాడు. నిజమేనని సాగర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఇలా జాబ్ చెయ్యాలని ఉందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని సాగర్ పై రామరాజు కోప్పడుతాడు. అంటే మీ మావయ్య గారి ఇంటికి ఇల్లరికం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నావా అని రామరాజు ఆంటాడు. అలా అన్ని ఉహించుకోకండి.. నా భార్యలాగా నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉందని సాగర్ అంటాడు. ప్లీజ్ నాన్న పిల్లల ఇష్టాలను తెలుసుకోండి. మీరు మారండి అని సాగర్ అంటాడు. మీ నాన్నకి ఎదురు మాట్లాడుతావా అని సాగర్ పై వేదవతి కోప్పడుతుంది.
ఆ తర్వాత సాగర్ బయట ఉండగా చందు వెళ్లి నాన్నకి ఎదురు మాట్లాడుతావా అని అడుగుతాడు. నేనేం తప్పు మాట్లాడలేదని సాగర్ అంటాడు. ఒరేయ్ చిన్నోడా చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడోనని చందు అనగానే నడిపోడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. నాకు కరెక్ట్ అనిపించింది వాడికి నచ్చింది చెయ్యాలనుకుంటున్నాడని ధీరజ్ అంటాడు. మరొకవైపు వేదవతి దగ్గరికి నర్మద వచ్చి.. సారీ అంటుంది. నువ్వేం చెప్పకమ్మ అని నర్మదపై వేదవతి కోప్పడుతుంది. ప్రేమ వస్తుంది.. తనపై కూడా వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.