English | Telugu
Brahmamudi : రాజ్ కడుతున్న కొత్త కంపెనీ గురించి ఇంట్లో చెప్పేసిన స్వప్న!
Updated : Nov 25, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -886 లో... సుభాష్ ని రాజ్ రెడీ చేసి తీసుకొని వస్తాడు. అపర్ణని కావ్య రెడీ చేసుకొని తీసుకొని వస్తుంది. మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎలా చూసుకుంటారని అబ్బాయి తరుపు వాళ్ళని కావ్య అడుగుతుంది. బాగా చూసుకుంటామని రాజ్ చెప్తాడు. అలాగే అమ్మాయి తరుపు వాళ్ళు మీరు మా అబ్బాయిని ఎలా చూసుకుంటారని రాజ్ అడుగుతాడు. బాగా చూసుకుంటామని కావ్య భారీ డైలాగ్స్ కొడుతుంది.
సుభాష్, అపర్ణ ఇద్దరు దండలు మార్చుకుంటారు. అందరు ఒక్కొక్కరుగా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. కావ్య, రాజ్ మీరేం తీసుకొని రాలేదా అని రుద్రాణి అడుగుతుంది. ఎందుకు తీసుకొని రాలేదు తీసుకొని వచ్చామని కావ్య తను తీసుకొని వచ్చిన గిఫ్ట్ అపర్ణకి ఇస్తుంది. అపర్ణ చిన్నప్పటి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఇస్తుంది. అది చూసి అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుభాష్ కోసం రాజ్ వాచ్ గిఫ్ట్ ఇస్తాడు. అది సుభాష్ చిన్నప్పటి వాచ్.. అది చూసి సుభాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు స్వప్న ల్యాప్ టాప్ తీసుకొని వెళ్ళడానికి రాజ్ గదిలోకి వస్తుంది. అప్పుడే కావ్య వచ్చి.. నువ్వేంటి అక్క ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదే స్టికర్ కోసం వచ్చానని అనగానే సరే అక్కడున్నాయి తీసుకోమని కావ్య అంటుంది. కావ్య ఉండగా ఎలా తీసుకొని వెళ్ళాలని స్వప్న అనుకుంటుంది. కావ్య బాసికల కోసం వెతుకుతుంది. కావ్య ఇక్కడ ఉన్నాయని స్వప్న ఇస్తుంది. దాంతో కావ్య అవి తీసుకొని వెళ్తుంది. స్వప్న ల్యాప్ టాప్ తీసుకొని వెళ్లి రాహుల్ కి ఇస్తుంది.
ల్యాప్ టాప్ పాస్ వర్డ్ రాహుల్ కి చెప్తుంది. అందులో కొత్త కంపెనీకి సంబంధించినది ఏవి ఉండవు.. రాజ్ ఫోన్ లో ఉంటాయని ఇద్దరు అనుకుంటారు. రాజ్ దగ్గరికి వెళ్లి స్వప్న ఫోన్ అడుగుతుంది. అర్జెంట్ కాల్ మాట్లాడాలని తీసుకుంటుంది. మరొకవైపు పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ లో అందరు హ్యాపీగా ఉంటారు. తరువాయి భాగంలో స్వప్న వచ్చి రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.