English | Telugu
విశాల్ - నయనిల హత్యకు వల్లభ కుట్ర!
Updated : Jun 10, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. తనకు, తన చుట్టూ వున్న వాళ్లకు జరగబోయేది ముందే పసిగట్టే వరం వున్న ఓ యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. ఇది కూడా రీమేక్ సీరియలే. ఆస్తికోసం గాయత్రీ దేవిని మర్డర్ చేయించి ఆమె స్థానంలో స్థిరపడిన తిలోత్తమ చుట్టూ సాగే కథ ఇది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది.
అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో పవిత్ర, నిహారికి, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, అనిల్ చౌదరి, శ్రీసత్య నటించారు. ఫ్యాక్టరీలో డైలీ లేబర్ ఉద్యోగం మానేసిన విశాల్, నయని సొంతంగా కంపనీ పెట్టడానికి రెడీ అయిపోతారు. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తిలోత్తమకు వివరించాలని, అదే సమయంలో గాయత్రీ దేవి మర్డర్ జరిగిన సందర్భంలో తిలోత్తమ పోగొట్టుకున్న బంగారు గాజుని తిరిగి ఇచ్చి తిలొత్తమలో వణుకు పుట్టించాలని నయని ప్లాన్ చేస్తుంది. అనుకున్న వెంటనే విశాల్, నయని కలిసి తిలోత్తమ కోసం ఇంటికి వెళతారు.
ఎంట్రెన్స్ లోనే కసి ఎదురుపడటంతో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది.. పెళ్లి కావాల్సిన అమ్మాయివి చెంపలు పగలగొట్టించుకుంటే బాగోదు అంటూ విశాల్ గడ్డిపెడతాడు. అక్కడి నుంచి విశాల్, నయని ఇంట్లోకి వెళతారు. తిలోత్తమ పెద్ద కొడుకు వల్లభ వెకిలి మాటలతో స్వాగతం పలుకుతాడు. ఆ మాటలని సహిస్తూనే విశాల్ , నయని లోపలికి వెళ్లి తాము ఎందుకు వచ్చామో ఏం చేయబోతున్నామో చెబుతారు. నయని తన చెల్లికి సారె పెడుతుంది. ఆ తరువాత `గానవి`(గాయత్రిదేవి, నయని, విశాల్) ఇండస్ట్రీస్ ని ప్రారంభించబోతున్నామని చెప్పి షాకిస్తాడు విశాల్.
పూట గడవడమే కష్టంగా వున్న మీరు కంపనీ పెడతారంటే నవ్వోస్తోందని వల్లభ వెటకారం ఆడతాడు. అయినా సరే మా కంపనీ బాగుండాలని మమ్మల్ని దీవిస్తూ నాలుగు మంచి మాటలు కాగితంపై రాసిమ్మంటుంది నయని. నయని ప్లాన్ తెలిసిన కసి తిలోత్తమ ని రాయకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తుంది కానీ నయని అడ్డుతగలడంతో కసి మాటలు తిలోత్తమ పట్టించుకోదు. వల్లభ కూడా ఆ నాలుగు ముక్కలేదో రాసేయ్ పండగ చేసుకుంటారనడంతో తిలోత్తమ.. నయని భావించినట్టుగానే రాసి ఇచ్చేస్తుంది. ఆ పేపర్ పట్టుకుని ఇంటికి బయలు దేరిని విశాల్, నయని మధ్యలో ఆగి మల్లెపూలు తీసుకుంటుంటే వెనకే కారులో వచ్చిన వల్లభ ఇద్దరిని హత్య చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? వల్లభ ప్లాన్ పారిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.