English | Telugu

కోల్‌క‌తా ట్రైనీ డాక్టర్ ఘటన...అంత ఈజీగా చంపకూడదు!

ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట అనే డాన్స్ షోనే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నంత గొప్ప కొరియోగ్రాఫర్. అలాంటి సందీప్ తన వైఫ్ జ్యోతి రాజ్ తో కలిసి సోషల్ మీడియాలో డాన్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అంటూ వీడియోస్ చేస్తూ రాని వారందరికీ డాన్స్ తన వీడియోస్ ద్వారా డాన్స్ నేర్పిస్తూ ఉంటారు.

వీళ్ళు నీతోనే డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక రీసెంట్ గా కోల్కతా ట్రైనీ డాక్టర్ విషయం ఎంతలా దేశాన్ని కుదిపేసిందో మనకు తెలుసు. చాలామంది కూడా భారతదేశంలో పుట్టినందుకు కూడా సిగ్గు పడుతున్నాం అంటూ చెప్తున్నారు.. అందులో చిన్మయి శ్రీపాదా కూడా ఇలాంటి ఎన్నో కామెంట్స్ ని కూడా చేసింది. ఇక ఇప్పుడు సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఈ ఘటన మీద. "భారత్ మాతాకి జై. ఒక్కోసారి మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంటుంది. మన కట్టు, బొట్టు, మన ఎథిక్స్, మన దేవుళ్ళు, మన పూజలు, మన సంప్రదాయాలు, మన పురాణాలు, మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా. కానీ ఒక స్త్రీని గౌరవించుకునే విషయంలో, ఒక స్త్రీని కాపాడుకునే విషయంలో, తప్పు చేసిన వారిని శిక్షించే విషయంలో ఇండియా చాలా వెనుకబడి ఉంది.

హైలైట్ ఏంటంటే అతి కిరాతకంగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఐనా చంపిన వాళ్ళు బతికేవున్నారు. జైలుకు మాత్రమే వెళ్లారు. వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది అన్నది ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఈ దేశంలో ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళను అంత ఈజీగా ఉరి తీసేసి చంపకూడదు. వాళ్లకు కచ్చితంగా నరకం చూపిస్తూ చంపాలి. " అంటూ జ్యోతి ఒక వీడియో మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.