త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో హీరోయిన్లు!
on Feb 10, 2022

హీరోయిన్ మంజిమా మోహన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ మీడియా రిపోర్టుల ప్రకారం ఆమె, తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌ను పెళ్లాడనున్నది. ఆ ఇద్దరూ 'దేవరాట్టమ్'లో కలిసి నటించారు. "ఆ సినిమా సెట్స్ మీద తొలిసారి కలుసుకున్న ఆ ఇద్దరూ తర్వాత చెన్నైలో సహజీవనం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఓ మంచి తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. రానున్న మాసాల్లో వారు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారు" అని ఒక టాబ్లాయిడ్ రాసుకొచ్చింది. Also read: డైరెక్టర్ పై రవితేజకు ఎందుకంత కోపం.. కావాలనే తక్కువ చేసి మాట్లాడాడా?
ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ వేడుక జరనుందని వదంతులు వినిపిస్తున్నప్పటికీ, ఆ ప్రచారాన్ని మంజిమ కొట్టివేసింది. అయితే గౌతమ్‌తో తన అనుబంధాన్ని ఆమె ఖండించలేదు. గౌతమ్ సైతం సమీప భవిష్యత్తులో తన పెళ్లి వార్తల గురించి అందరికీ తెలియజేయనుండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పినట్లు ఆ టాబ్లాయిడ్ వెల్లడించింది. Also read: వ్యానిటీలో 'పుష్ప'గా బన్నీ ఇలా మారిపోయేవాడు!
తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన తమిళ యాక్టర్ కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్. ఇక మలయాళీ అయిన మంజిమ.. తెలుగులో నాగచైతన్య జోడీగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటించింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా భువనేశ్వరి పాత్రలో దర్శనమిచ్చింది. విష్ణువిశాల్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఎఫ్ఐఆర్'లో ఆమె హీరోయిన్‌గా నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



