English | Telugu
జెస్సీకి అరియానా వార్నింగ్
Updated : Nov 15, 2021
వర్టీగో వ్యాధి కారణంగా గత కొన్నిరోజులుగా బాధపడుతున్న జెస్సీ ఈ ఆదివారం అనారోగ్య కారణాల వల్ల ఇంటి నుంచి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో వున్నన్ని రోజులు నోట్లో నాలుక లేని వాడిగా కనిపించిన జెస్సీ ఆ తరువాత నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం మొదలుపెట్టాడు. తనకు నచ్చని ఇంటి సభ్యులపై యారగెంట్‌గా ప్రవర్తిస్తూ తన నైజాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చాడు.
సన్నీపై ఓ రేంజ్‌లో యుద్ధానికి దిగి షన్నూ చేత చివాట్లు తిన్న జెస్సీ తాజాగా తన బుద్దిని మరో సారి బయటపెట్టి షాకిచ్చాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాల వల్ల ఆదివారం బయటికి వచ్చేసిన జెస్సీ `బిగ్‌బాస్ బజ్` కోసం అరియానాకు ఇంటర్వ్యూ ఇవ్వడాపనికి వచ్చి నానా రచ్చ చేశాడు. అరియానా అడక్కుండానే సిరి తన ఫస్ట్ క్రష్ అని చెప్పిన జెస్సీ చూడగానే యమ వుంది అనిపించిందని సిరి గురించి తన ఒపీనియన్ చెప్పేశాడు.
సిరి క్రష్ కరక్టు మరి శ్వేత ఏంటి ? .. నాకు ఎవ్వరూ కనెక్ట్ కావట్లేదు.. అందమైన అమ్మాయి రావాలని అన్నావని అరియానా.. జెస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. `మొన్నటి వరకు సీక్రెట్ రూమ్‌లో వున్నా నా రూమ్‌లోకి కొత్త వాళ్లని పంపిస్తారేమో అనుకున్నా అంటూ నవ్వేశాడు జెస్సీ.. దీంతో చిర్రెత్తుకొచ్చిన అరియానా `రూమ్‌లో ఒక్కడినే వున్నా అనడం చాలా చండాలంగా వుంది తెలుసా? అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.