English | Telugu

Jayam serial : బాక్సింగ్ లో రుద్రని చంపడానికి వీరు ప్లాన్.. మార్టిన్ గెలుస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -95 లో......రుద్రతో పోటీ పడడానికి పారు మలేషియా నుండి ఒక ఛాంపియన్ ని రప్పిస్తుంది. అతను రాగానే రుద్ర తో పోటీ అని తెలుస్తుంది. తనతో పోటీ అంటే కచ్చితంగా ఓడిపోతాను.. నేను పోటీ పడను అని మాలేషియా నుండి వచ్చిన మార్టిన్ అంటాడు. నువ్వు గెలిస్తే పాతిక లక్షలు ఇస్తాను.. నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీకి కోటి ఇస్తానని పారు అనగానే మార్టిన్ ఒప్పుకుంటాడు.

రుద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మార్టిన్ భయపడుతాడు. అప్పుడే వీరు తన దగ్గరికి వస్తాడు. ఏంటి రుద్రని చూసి బయపడుతున్నావా అని మార్టిన్ ని అడుగుతాడు. నువ్వు రుద్రని బాక్సింగ్ లో చంపెయ్.. నీకు రెండు కోట్లు ఇస్తానని చెప్తాడు. దాంతో మార్టిన్ సరే అంటాడు. పోటీకి మార్టిన్ ఇంకా రుద్ర సిద్ధం అవుతారు. అప్పుడే పారు ఎంట్రీ ఇచ్చి.. ఈ పోటీలో ఓడిపోతే ఇక ఎప్పుడు బాక్సింగ్ ఆడనని ఆ అగ్రిమెంట్ పై సంతకం చెయ్యమని పారు మెలిక పెడుతుంది. దాంతో అందరు సంతకం పెట్టకని రుద్రకి చెప్తారు. రుద్ర సర్ మీరు సంతకం చెయ్యండి అని గంగ చెప్తుంది. రుద్ర సంతకం చేస్తాడు. పోటీ మొదలవుతుంది.

మొదటి రౌండ్ కి మార్టిన్ ని రుద్ర చిత్తు చేస్తాడు. దాంతో వీరు, పారు డిస్సపాయింట్ అవుతారు. పారు బయటకు వెళ్తుంటే తన వెనకాలే వీరు వెళ్లి ఆ మార్టిన్ కి.. మీ తమ్ముడు బానుని చంపింది ఎవరో నాకు తెలుసని రుద్రకు చెప్పు.. ఓడిపోతే చెప్తానని అబద్ధం చెప్పించండి అని పారుకి వీరు సలహా ఇస్తాడు. దాంతో మార్టిన్ దగ్గరికి పారు వెళ్లి.. రుద్రని ఇలా బ్లాక్ మెయిల్ చెయ్ అని చెప్తుంది. ఆ తర్వాత రుద్ర, మార్టిన్ రెండో రౌండ్ లో పోటీ పడుతుంటే మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు.. నువ్వు ఓడిపోతే చెప్తానని రుద్రని మార్టిన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో మార్టిన్ కొట్టిన కూడా రుద్ర సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.