English | Telugu
Bigg Boss 9 Telugu Buzz: డీమాన్ పవన్ తో పులిహోర ఏంటి.. బజ్ లో రమ్య మోక్షని బయటపెట్టిన శివాజీ!
Updated : Oct 27, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. హౌస్ లో బాండ్స్ ఉన్నాయి.. లవ్ పార్క్ లా ఉంది. వాటిని తీసేస్తా అంటు లోపలికి వెళ్ళిన రమ్య మోక్ష ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది.
రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత బజ్ ఇంటర్వ్యూ కి వచ్చేసింది. అందులో శివాజీ అడిగిన ప్రశ్నలకు తడబడింది రమ్య. హౌస్ కి బాండింగ్స్ వద్దని వెళ్ళిన నువ్వు.. మాధురితో బాండింగ్ ఎందుకు కోరుకున్నావని శివాజీ అడుగగా.. లేదు తనతో బాండింగ్ లేదు... తనతో ఉంటే బాగుంటుందని చెప్పాను.. ఫస్ట్ లో తను నాతో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు తనుతో కలిసి ఫేక్ బాండింగ్ లో ఉందనిపించిందని అలా చెప్పానని రమ్య మోక్ష అంది. ఇక హౌస్ లో ఎవరెలాంటి వారో ఒక్కో జంతువుతో పోల్చాలని సరైన కారణం చెప్పాలని శివాజీ అన్నాడు. స్క్రీన్ మీద తాబేలు ఫొటో చూపించి ఎవరికి సూట్ అవుతుందని శివాజీ అడుగగా.. రాము పేరు చెప్పింది రమ్య. చీతా బొమ్మ కనిపించగానే గౌరవ్.. అని ఆన్సర్ ఇచ్చింది. గౌరవా ఆర్ యూ షూర్.. అని శివాజీ అడిగాడు. బయటున్నప్పుడు ఎపిసోడ్స్ చూడలేదు అనుకున్నానే కానీ లోపల కూడా ఏం అబ్జర్వ్ చేయలేదు అమ్మడూ నువ్వు అని శివాజీ అన్నాడు. నక్క ఎవరని అడుగగా.. తనూజ అంది. గాడిద ఎవరని అడుగగా.. ఇమ్మాన్యుయల్ పేరు చెప్పింది. ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పుకొచ్చింది.
హౌస్‌లో మీరే నెగెటివ్ అని హౌస్‌మేట్స్ అందరూ అన్నారు.. అని శివాజీ చెప్పాడు. అందరూ అనలేదు సర్ ఇద్దరు అన్నట్లున్నారు.. అది వాళ్ల ఆలోచన అని రమ్య చెప్పింది. ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు.. ఏం జరుగుతుంది అనేది.. చాలా ఆటిట్యూడ్ తోటి థాంక్యూ.. అని అన్నారంటూ శివాజీ ఇమిటేట్ చేసి చూపించాడు. అలా రీచ్ అయి ఉంటుందేమో.. అని రమ్య అంటే ఆ రీచ్ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది.. అంటూ శివాజీ మళ్లీ కౌంటర్ వేశాడు. మీరు ఈ హౌస్‌కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా.. మీరు బాండ్ క్రియేట చేసుకోవడానికి సుమన్ గారికి దగ్గరగా ఉన్నారేమోనని అందరూ అడుగుతున్నారు.. అని శివాజీ కొశ్చన్ చేశాడు. ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్లతోటే ఉండాలనిపిస్తుంది సర్.. అని రమ్య అంది. దీంతో మీకు సింపథీనా.. అని శివాజీ అడిగితే నాకేం సింపథీ కాదు సర్.. అని రమ్య ఆన్సర్ ఇచ్చింది. నేను పవన్‌తో పులిహోర ఏం కలపలేదు సార్.. అని రమ్య అడగ్గానే వీడియో ప్లీజ్.. అంటూ ప్లే చేశాడు శివాజీ. అందులో నీకు ఎవరు నచ్చారు ఈ హౌస్‌లో.. అని మాధురి అడిగితే పవన్ చాలా ఇన్నోసెంట్.. పవన్‌యే ఇష్టం నాకు.. అంటూ రమ్య చెప్పింది. వెంటనే కట్ అంటూ రమ్య వైపు సూటిగా చూశాడు శివాజీ. ఇక ఆ తర్వాత రమ్యకి ఏం చెప్పాలో తెలియక తడబడింది. మరి ఈ బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి.