English | Telugu

Jayam serial : గంగ బాక్సింగ్ స్కిల్ చూసి ఇంప్రెస్ అయిన రుద్ర.. శకుంతల ఇచ్చిన ట్విస్ట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'( Jayam).ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -101 లో..... గంగని పారు మనుషులు కిడ్నాప్ చేస్తారు. గంగని సేవ్ చెయ్యడానికి రుద్ర అక్కడికి వస్తాడు. రుద్ర ట్రైనింగ్ ఇచ్చినట్లు గంగ రౌడీలని కొడుతుంది. అది చూసి రుద్ర ఇంప్రెస్ అవుతాడు. అదేంటి గంగ అలా కొడుతుందని పారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సూపర్ గంగ చాలా బాగా కొట్టావ్.. నువ్వు ట్రైనింగ్ తీసుకున్న బాక్సర్ లా కొట్టావని రుద్ర మెచ్చుకుంటాడు. అంతే అంటారా మీ ట్రైనింగ్ దూరం నుండి చూసే ఇలా నేర్చుకున్నానని గంగ అంటుంది.

దూరం నుండి అయితేనే ఇలా ఉంది.. ఇక పర్ ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇంకా ఎలా ఉంటుందోనని రుద్ర అంటాడు. ముందు మనం ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నన్ను ఎందుకు కిడ్నాప్ చేసారో కనుక్కోవాలని రుద్రతో గంగ అంటుంది. మరొకవైపు పారు, వీరు మాట్లాడుకుంటారు. ప్లాన్ ఫెయిల్ అయిందని పారు చెప్తుంది. ఈసారి కాకుంటే నెక్స్ట్ టైమ్ అని వీరు అంటాడు. ప్రాబ్లమ్ అది కాదు.. ఆ గంగ పెద్ద బాక్సర్ లాగా రౌడీలని కొట్టింది.. అలా రౌడీలని కొట్టడం చూసి రుద్ర ఇంప్రెస్ అయ్యాడు.. తన టాలెంట్ చూసి ట్రైనింగ్ ఇచ్చి బాక్సర్ ని చేస్తే పరిస్థితి ఏంటని వీరుతో పారు అంటుంది. ఆ తర్వాత నువ్వు శకుంతల అత్తకి నచ్చేలా ఉండాలి.. రుద్రకి భార్య అవ్వాలని వీరు చెప్తుంటే పారు షాక్ అవుతుంది.

మరొకవైపు గంగ ఇంటికి వచ్చి రుద్ర గురించి చెప్తుంటే.. లక్ష్మీ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత శకుంతల తన ఫ్యామిలీని తీసుకొని ఫామ్ హౌస్ కి వస్తుంది. ఎందుకు తీసుకొని వచ్చావని అందరు అడుగగా.. రుద్రకి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అని అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.