English | Telugu
Jayam serial : పారు నిజస్వరూపం తెలుసుకున్న రుద్ర.. శకుంతల కనుక్కోగలదా!
Updated : Nov 21, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -119 లో.. పారు పాయిజన్ తాగుతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే పోలీసులు వస్తారు. నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ గంగ అని హరి చెప్పగానే గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పారుని హరి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత సారీ పెద్దనాన్న ఇలా జరుగుతుందనుకోలేదని పెద్దసారుతో రుద్ర అంటాడు.
నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్.. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పారు గురించి కాదు గంగ గురించి.. తనని నువ్వే బయటకు తీసుకొని రావాలని పెద్దసారు అంటాడు. రుద్ర స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడే లక్ష్మీ కూడా వస్తుంది. గంగకి బెయిల్ ఇవ్వండి అని రుద్ర అడుగుతాడు. బెయిల్ కంటే ఈ కేసు వెనక్కి తీసుకొమ్మని చెప్పండి అని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే సరే నేను ట్రై చేస్తానని హరి దగ్గరికి రుద్ర వస్తాడు. కేసు వెనక్కి తీసుక్కొమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తీసుకోనని అతను తిరిగి పంపిస్తాడు. మరొకవైపు శకుంతల మనసులో ఇషిక, వీరు కలిసి రుద్ర, గంగ గురించి నెగెటివ్ క్రియేట్ చేస్తారు. కావాలనే డాక్టర్ తో మాట్లాడినట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. పారు కండిషన్ సీరియస్ అంట అని శకుంతలకి చెప్తాడు.
మరొకవైపు పారు, హరి హాస్పిటల్ లో మన ప్లాన్ సక్సెస్ అని మాట్లాడుకుంటుంటే.. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇచ్చి వాళ్ళ మాటలు వింటాడు. నైస్ ప్లే అని అంటాడు. గంగ దగ్గరికి వెళ్లేముందు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నీ పగకోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావని అర్థమైందని రుద్ర అన్నీ చెప్తుంటే పారు, హరి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.