English | Telugu

Karthika Deepam2: సవతి తల్లిని అవమానించిన జ్యోత్స్న.. అందరి ముందు కాళ్ళు పట్టించారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -520 లో.....శివన్నారాయణ ఇంట్లో హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే శ్రీధర్ తన కుటుంబంతో వస్తాడు. అది చూసి వచ్చాడండి ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు అని శ్రీధర్ ని ఉదేశ్యంచి పారిజాతం అంటుంది. శివన్నారాయణ కుటుంబం మొత్తం శ్రీధర్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. శౌర్యాతో శివన్నారాయణ సరదాగా మాట్లాడతాడు.

కావేరీని సుమిత్ర పలకరిస్తూ.. నన్ను ఇక వదిన అని పిల్వండి అని చెప్తుంది. దాంతో కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది నా పరివారం.. ఇక గతం అంత మర్చిపోండి అని శివన్నారాయణ అందరితో చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న అందరి కాళ్ళకి పసుపు రాయి అని సుమిత్ర చెప్తుంది. సరే మమ్మీ రాస్తాను కానీ నువ్వు చెప్పు ఈ పసుపు ఎవరికి రాస్తారని జ్యోత్స్న అడుగుతుంది.

ఈ పసుపు భర్త ఉన్నవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చని సుమిత్ర అంటుంది. మరి అత్త తన భర్తతో లేదు కదా అని జ్యోత్స్న అంటుంది. నాకు తెలుసు కావాలనే ఇదంతా చేస్తున్నావని కాంచన కోప్పడుతుంది. నీతో భర్త లేడని అంటున్నాను.. ఆవిడకి నువ్వు నీ భర్తని ఇచ్చావ్ కానీ తనకి సోసైటీలో గుర్తింపు ఉండదు. తనని ఉంపుడుగత్తే అంటారని జ్యోత్స్న అనగానే స్వప్న, కావేరి బాధపడతారు. మమ్మల్ని అవమానించడానికే పిలిచారని స్వప్న, కావేరిని తీసుకొని వెళ్లిపోతుంటే.. అప్పుడే కార్తీక్ ఎదరుపడతాడు జ్యోత్స్న మాటలు చెప్తుంది. దాంతో పిన్నికి సారీ చెప్పమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్న సారీ చెప్తుంది. ఇప్పుడే కావేరి వదిన కాళ్ళకి పసుపు రాయి అని సుమిత్ర అనగానే జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...