English | Telugu

Brahmamudi : ఆఫీస్ కి వెళ్ళిన రాహుల్.. అవమానించారని స్వప్న ఫీలింగ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -883 లో..... రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడే శృతి వచ్చి కొన్ని ఫైల్స్ ఇచ్చి ఇందులో సంతకం పెట్టమని చెప్తుంది. ఫైల్ చెక్ చెయ్యాలి కదా అని రాహుల్ అనగానే అవసరం లేదు రాజ్ సర్ ఆల్రెడి చూసారు. కేవలం మీరు సంతకం పెడితే చాలని శృతి అంటుంది. అయితే కేవలం ఒక సంతకానికి మాత్రమే నేను రావాలా.. ఈ విషయం స్వప్నకి తెలిసేలా చెయ్యాలని రాహుల్ అనుకుంటాడు.

స్వప్నకి ఫోన్ చేసి తిన్నావా అని రాహుల్ అడుగుతాడు. లేదు నువ్వు అని స్వప్న అడుగుతుంది. నేను బయట తినను కదా అని రాహుల్ చెప్తాడు. సరే నేను లంచ్ తీసుకొని వస్తానని స్వప్న అంటుంది. మరొకవైపు సుభాష్, అపర్ణ పెళ్లిరోజు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. సుభాష్ యంగ్ గా రెడీ అయి పెళ్లిచూపులకి వస్తాడు. అపర్ణతో సుభాష్ మాట్లాడతాడు. ఆ తర్వాత స్వప్న బాక్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుంది. రాహుల్ భోజనం చేస్తాడు. అప్పుడే శృతి వచ్చి.. సర్ ఇందులో సంతకం పెట్టండి అంటుంది. ఫైల్ చెక్ చేస్తానని రాహుల్ అంటాడు అవసరం లేదు సర్ మీరు సంతకం పెట్టండి అంతే మీరు జస్ట్ టైమ్ పాస్ చేయండి అని శృతి అంటుంది. అదంతా స్వప్న చూసి శృతిపై కోప్పడుతుంది.

పెత్తనం ఇచ్చినట్లే ఇచ్చి ఇలా చేస్తారా.. వాళ్ళ సంగతి చెప్తానని స్వప్న అంటుంది. స్వప్న ఇదంతా కామన్ అని రాహుల్ యాక్టింగ్ చేస్తాడు. మరొకవైపు సుభాష్ పెళ్లిచూపులకి వచ్చి అపర్ణని అలా నడవమంటాడు. తరువాయి భాగం లో కావ్య దగ్గరికి స్వప్న వచ్చి నా భర్తని ఎందుకు అవమానిస్తున్నారని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.