English | Telugu
జానకి కలగనలేదు vs మనసిచ్చిచూడు
Updated : Jun 4, 2022
ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు `స్టార్ మా`లోని పాపులర్ టెలివిజన్ నటీనటులతో యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న షో `స్టార్ మా పరివార్ లీగ్`. గత కొన్ని వారాలుగా రెండు పాపులర్ సీరియల్స్ కు సంబంధించిన నటీనటులని రెండు టీమ్ లుగా ఏర్పాటు చేసి వారి మధ్య పోటీని నిర్వహిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. గత ఆదివారం 'దేవత', 'రాఖీ పూర్ణిమ' సీరియల్ కు చెందిన నటీనటులు పోటీపడ్డారు. సెమీ ఫైనల్ లో భాగంగా జరిగిన ఈ పోటీలో 'దేవత' టీమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఇక ఈ ఆదివారం అంటే జూన్ 5న మరో రెండు సీరియల్స్ టీమ్స్ పోటీపడబోతున్నాయి.
జూన్ 5న 'జానకి కలగనలేదు', 'మనసిచ్చిచూడు' టీమ్ లు పోటీపడుతున్నాయి. 'జానకి కలగనలేదు' టీమ్ నుంచి అమర్ దీప్ చౌదరి, అనిల్ అల్లం, విష్ణు ప్రియ, మరోనటి పాల్గొన్నారు. ఇక `మనసిచ్చిచూడు` సీరియల్ నుంచి మహేష్ (ఆది), కీర్తి భట్, త్రిష దంతాల, హరితేష్ పోటీకి దిగారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. `ఈ టీమ్స్ ఎలాంటోళ్లంటే ఆడితే అదరిపోవాలి.. ఆడాక గుర్తుండిపోవాలి` అంటూ ఝాన్సీ వాయిస్ తో ప్రోమో మొదలైంది.
'ఆది, రామా కలిసి గేమ్ ఆడితే ఎట్లుంటది ఎస్ ఎమ్ పీఎల్ (స్టార్ మా పరివార్ లీగ్) స్టేజ్ దద్దద్దరిల్లిపోవాలి' అన్నాడు మహేష్ (ఆది). ఇదిలా వుంటే ఈ రేసులో 'జానకి కలగనలేదు' టీమ్ కు చెందిన అనిల్ అల్లం, 'మనసిచ్చిచూడు' టీమ్ కు చెందిన త్రిష తెగ కామెడీ చేశారు. వీళ్లపై పేలిన వాయిస్ పంచ్ లు నవ్వులు పూయిస్తున్నాయి. ఇక `మనసిచ్చిచూడు` నుంచి పాటపాడేందుకు వచ్చిన హరితేష్ 'రాములో రాములా' పాటని ఖూనీ చేసేసి నవ్వులు పూయించాడు.
ఆ తరువాత 'మనసిచ్చిచూడు' నుంచి `కాంచన` సాంగ్ తో మహేష్ అదరగొట్టేశాడు. ఇక 'జానకి కలగనలేదు' టీమ్ `కేజీఎఫ్ 2` ని పెర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా 'మనసిచ్చిచూడు' టీమ్ నుంచి త్రిష, అమర్ దీప్ చౌదరి చేసిన `అమ్మా అమ్మా.. నీ వెన్నెలా.. ` అంటూ సాగే పాటకు అదిరిపోయే పెర్ఫార్మ్ చేసి కన్నీళ్లు తెప్పించి మార్కులు కొట్టేశారు. పోటా పోటీగా సాగిన వీరి పెర్ఫార్మెన్స్ లతో ఏ టీమ్ పై చేయి సాధించిందో తెలియాలంటే ఆదివారం జూన్ 5న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రసారం కానున్న 'స్టార్ మా పరివార్ లీగ్' చూడాల్సిందే.