English | Telugu
సాక్షి కారులో వెళ్లిన రిషీకి యాక్సిడెంట్
Updated : Jun 4, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రక్ష గౌడ, ముఖేష్ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో సాయి కిరణ్, జ్యోతి రాయ్, మిర్చి మాధవి, ఉష శ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ వారం కీలక మలుపులు తిరుగుతున్నఈ సీరియల్ ఈ శనివారం సరికొత్త ట్విస్ట్ లలో సాగబోతోంది. ఇంతకీ శనివారం 468వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఒకసారి చూద్దాం.
వసుధార తన పుస్తకం గురించి పుష్పను అడిగితే..రిషీ సార్ నీ బుక్ తీసుకుని అక్కడ పెట్టామన్నారని చెబుతుంది. అయ్యే ఎందుకిచ్చావ్ పుష్ప ఆ బుక్ లో.. అంటూ ఆగిపోతుంది వసుధార. పుస్తకం తీసుకోవడానికి వెళ్లగా అప్పుడే రిషీ వచ్చి పుస్తకాన్ని చూస్తాడు. ఆ పుస్తకంలో వసు రిషీకి సారీ సార్ అని రాస్తుంది. అది చూసి పొగరా ఏంటీ ఇలా చేస్తోంది ఒక వైపు ప్రేమ నాపై ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. మరో వైపు తనకు ఇష్టం లేదని చెబుతోంది. ఇప్పడు నేను ఏమని అర్థం చేసుకోవాలి అనుకుంటాడు రిషీ.. వెంటనే ఆ పేపర్ ని చించేసి తన జేబులో వేసుకుంటాడు.
ఆ తరువాత వసుకు తనకు మధ్య జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటాడు రిషి. ఇదిలా వుంటే సీన్ లోకి ధరణి ఎంట్రీ ఇస్తుంది. రిషీకి కాఫీ ఇస్తుంది. అనంతరం ఇలా అడగకూడదు అని నాకు తెలుసు కానీ తప్పడం లేదు అంటూనే ఏమైంది రిషీ ఎందుకింత బాధపడుతున్నావ్ అంటుంది. కట్ చేస్తూ.. రిషీని కలవడానికి వచ్చిన సాక్షిని జగతి అడ్డుకుంటుంది. తన మూడ్ బాలేదని చెబుతుంది. అయితే రిషీ మూడు నేను వెళితే మారుతుందని సాక్షి చెబుతుంది. నిన్ను చూస్తేనే రిషీ మండిపడుతున్నాడని చెబుతుంది. ఇంతలో దేవయాని ఎంట్రీ ఇచ్చి రిషీకి సాక్షి కాబోయే భార్య అంటుంది. నా కొడుకు గురించి మీరు నిర్ణయాలు తీసుకోవడం ఏంటీ అంటూ ఆగ్రహిస్తుంది జగతి. ఆ మాటలకు దేవయాని, సాక్షి భయపడిపోతారు.
కట్ చేస్తే... రిషీ, మహేంద్ర, జగతి రెస్టారెంట్ లో వుంటారు. అక్కడికి సాక్షి రావడంతో నన్ను ఇంటి వద్ద డ్రాప్ చేస్తావా? అని రిషీ అడుగుతాడు. ఇద్దరు కార్ లో ఇంటికి బయలు దేరతారు... మార్గ మధ్యంలో యాక్సిడెంట్ కావడంతో రిషీ కి తలకు బలమైన గాయం అవుతుంది. తను రోడ్డుపై పడి వుండటాన్ని వసుధార గమనించి షాక్ అవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.