English | Telugu

హాలీవుడ్ పిలుస్తోంది...మీరేమంటారు ?

జగ్గూభాయ్ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. జగపతిబాబుని ఫాన్స్ ముద్దుగా జగ్గూభాయ్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఫామిలీ మూవీస్ ఎక్కువగా చేసి లేడీ ఫాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు జగపతి బాబు. వయసుతో పాటు సినిమాల్లో రోల్స్ కూడా చేంజ్ చేస్తూ వచ్చి విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. జగపతిబాబుని ఫామిలీ మూవీస్ లో ఎంత ఇష్టపడతారో విలన్ రోల్స్ లో కూడా అంతగానే ఇష్టపడతారు ఆడియన్స్. ఆయన విలనిజం రంగస్థలం, అరవింద సామెత మూవీస్ లో చూస్తే తెలిసిపోతుంది. కరుడుగట్టిన విలన్ గా నటించడంలో జగ్గుభాయ్ తర్వాతే ఎవరన్నా.. హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో జగపతి బాబు నటించారు.

ఇక ఇప్పుడు జగ్గూ భాయ్ కి ఏకంగా హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు" అని పోస్ట్ చేశాడు. ఇక ఫాన్స్, నెటిజన్స్ ఊరుకుంటారా "మీరు హాలీవుడ్ మెటీరియల్ సర్ వెళ్ళండి", "వెళ్ళండి, హాలీవుడ్ మూవీస్ లో మిమ్మల్ని చూడాలని ఉంది" "ప్రపంచం మెచ్చే నటుడు కావలి మీరు వెళ్ళండి" " ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మావ, కుమ్మేయ్ అక్కడ కూడా " అంటూ ఓ రేంజ్ ఫైర్ ఫుల్ ఎమోజిస్ తో హాలీవుడ్ కి వెళ్లమంటూ జగ్గు భాయ్ ని నెటిజన్స్ తమతమ కామెంట్స్ తో మోటివేట్ చేశారు. విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సీనియర్‌ నటుడు జగపతిబాబు . సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్‌. మరి అలాంటి జగ్గు భాయ్ ఏ హాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నాడో తెలియాలంటే ఆయన నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే.